30వ పడిలో విరాట్ కొహ్లీ

విరాట్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ 30 ఏళ్ల వయసులోనే 60 సెంచరీల మొనగాడు 2018 సీజన్లో టెస్టుల్లో 1063, వన్డేల్లో 1202 పరుగుల కొహ్లీ టెస్టు, వన్డే ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్ విరాట్ కొహ్లీ టీమిండియా కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్, ఆధునిక క్రికెట్ రికార్డుల మొనగాడు విరాట్ కొహ్లీ… 30వ పడిలోకి ప్రవేశించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు, టీ-20 క్రికెట్లో… 2వేల పరుగులు సాధించడం […]

Advertisement
Update: 2018-11-05 04:00 GMT
  • విరాట్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
  • 30 ఏళ్ల వయసులోనే 60 సెంచరీల మొనగాడు
  • 2018 సీజన్లో టెస్టుల్లో 1063, వన్డేల్లో 1202 పరుగుల కొహ్లీ
  • టెస్టు, వన్డే ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్ విరాట్ కొహ్లీ

టీమిండియా కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్, ఆధునిక క్రికెట్ రికార్డుల మొనగాడు విరాట్ కొహ్లీ… 30వ పడిలోకి ప్రవేశించాడు.

వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు, టీ-20 క్రికెట్లో… 2వేల పరుగులు సాధించడం ద్వారా రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన కొహ్లీ… 30 ఏళ్లకే … వన్డే క్రికెట్లో 38 సెంచరీలు సాధించడం ద్వారా…. మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు తానే తగిన వారసుడనని చాటి చెప్పాడు.

టెస్టు క్రికెట్లో విరాట్ జోరు….

2018లో కొహ్లీ ఆడిన మొత్తం 10 టెస్టుల్లో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో సహా 1063 పరుగులతో 59.05 సగటు సాధించాడు.

వన్డే క్రికెట్లో కొహ్లీ హోరు…

ఇక.. వన్డే క్రికెట్లో 14 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ ఆరు శతకాలు, మూడు అర్థశతకాలతో సహా 1202 పరుగులు సాధించాడు. 133. 55 సగటు నమోదు చేశాడు. 73.57 సగటుతో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచాడు.

టెస్ట్, వన్డే ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ కు ఎదిగిన కొహ్లీ…బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను తన జీవిత భాగస్వామిగా చేసుకొన్న తర్వాత నుంచి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు.

దేశంలోని కోట్లాదిమంది యువ అభిమానుల అభిమాన ఆటగాడిగా ఉన్న కొహ్లీకి…అభిమానులు, పలువురు మాజీ క్రికెట్ దిగ్గజాలతో పాటు బీసీసీఐ సైతం జన్మదిన శుభాకాంక్షల వర్షం కురిపించారు. వచ్చే సీజన్లో సైతం కొహ్లీ ఇదేస్థాయిలో రాణించాలని కోరారు.

Advertisement

Similar News