బయోపిక్ విడుదలపై అనుమానాలు

ఎన్టీఆర్ బయోపిక్ 2 భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టుల రిలీజ్ డేట్స్ ను కూడా గతంలో ఆర్భాటంగా ప్రకటించారు. అయితే హడావుడిగా అప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు యూనిట్ తలకు చుట్టుకుంది. రిలీజ్ డేట్స్ పై నందమూరి ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. రెండు పార్టుల మధ్య కనీసం నెల రోజులు గ్యాప్ మెయింటైన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాను జనవరి 9న విడుదల చేయబోతున్నారు. ఆ వెంటనే 2 వారాల గ్యాప్ లో […]

Advertisement
Update: 2018-10-31 07:05 GMT

ఎన్టీఆర్ బయోపిక్ 2 భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టుల రిలీజ్ డేట్స్ ను కూడా గతంలో ఆర్భాటంగా ప్రకటించారు. అయితే హడావుడిగా అప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు యూనిట్ తలకు చుట్టుకుంది. రిలీజ్ డేట్స్ పై నందమూరి ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. రెండు పార్టుల మధ్య కనీసం నెల రోజులు గ్యాప్ మెయింటైన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాను జనవరి 9న విడుదల చేయబోతున్నారు. ఆ వెంటనే 2 వారాల గ్యాప్ లో జనవరి 24న ఎన్టీఆర్-మహానాయకుడు సినిమాను విడుదల చేయబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. దీనిపైనే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సినిమా-సినిమాకు మధ్య నెల రోజులు కూడా గ్యాప్ లేకపోతే రికార్డులు ఎలా బద్దలవుతాయని ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా 2 వారాలకే ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాను ఎత్తేశారంటూ మిగతా హీరోల ఫ్యాన్స్ తమను ఎగతాళి చేస్తూ ట్రోలింగ్ చేస్తారని ఆరోపిస్తున్నారు.

ఫ్యాన్స్ ఆరోపణల్లో నిజం ఉంది. అందుకే యూనిట్ ఇప్పుడు ఆలోచనలో పడింది. బయోపిక్ సెకెండ్ పార్ట్ ఎన్టీఆర్-మహానాయకుడు సినిమా విడుదలను వాయిదావేసే ఆలోచనలో ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 ఫిబ్రవరి సెకెండ్ వీక్ లో రిలీజ్ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News