హిట్ కోసం "మహానటి" ఎదురుచూపులు

“మహానటి” సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకున కీర్తి సురేష్ ఆ తరువాత నటిగా మంచి మంచి సినిమాలు చేసి దూసుకుపోతుంది అని అనుకున్నారంతా, కానీ కీర్తి సురేష్ మాత్రం అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ బొక్క బోర్లా పడింది. ఈ భామ తెలుగు లో సినిమాలు చెయ్యకపోయిన తమిళ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ రిలీజ్ చేసింది. విక్రమ్‌ సరసన చేసిన “సామి-2” సినిమా బోల్తా కొట్టేయడం కీర్తి సురేష్‌కి చాలా పెద్ద మైనస్‌ […]

Advertisement
Update: 2018-10-22 04:00 GMT

“మహానటి” సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకున కీర్తి సురేష్ ఆ తరువాత నటిగా మంచి మంచి సినిమాలు చేసి దూసుకుపోతుంది అని అనుకున్నారంతా, కానీ కీర్తి సురేష్ మాత్రం అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ బొక్క బోర్లా పడింది. ఈ భామ తెలుగు లో సినిమాలు చెయ్యకపోయిన తమిళ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ రిలీజ్ చేసింది.

విక్రమ్‌ సరసన చేసిన “సామి-2” సినిమా బోల్తా కొట్టేయడం కీర్తి సురేష్‌కి చాలా పెద్ద మైనస్‌ గా మారింది. ఆ సినిమా తర్వాత వచ్చిన విశాల్‌ “పందెంకోడి-2” కూడా కీర్తి సురేష్‌కి నిరాశపరిచే ఫలితం ఇచ్చింది. మాస్‌ని కొంతవరకు ఈ సినిమా అలరిస్తున్నా… కీర్తి సురేష్‌ విషయంలో కొన్ని నెగెటివ్‌ కామెంట్స్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి మూవీపై అనుమానాలు పెరిగిపోయాయి. మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా రూపొందుతోన్న “సర్కార్‌” ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై కీర్తి సురేష్‌ చాలా అంచనాలే పెట్టుకుంది. కనీసం ఈ సినిమాతో అయిన హిట్ అందుకుంటానన్న ధీమాతో కీర్తి సురేష్ ఉంది.

Tags:    
Advertisement

Similar News