కన్నయ్య కుమార్ పై దాడి

పట్నాలోని ఎయిమ్స్‌ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) ఆసుపత్రి సిబ్బందితో దుష్ర్పవర్తనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సోమవారం జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జె.ఎన్.యు.) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ పై ఎఫ్.ఐ.ఆర్. దాఖలైంది. ఆ మర్నాడే బీహార్ లోని బెగూ సరాయ్ లో ఆయన మీద క్రూరమైన దాడి జరిగింది. ఆర్.ఎస్.ఎస్. అనుబంధ సంస్థ బజరంగ్ దళ్ కు చెందిన వారు ఈ దాడికి పాల్పడ్డారని అనుకుంటున్నారు. కన్నయ్య కుమార్ మద్దతు […]

Advertisement
Update: 2018-10-17 01:15 GMT

పట్నాలోని ఎయిమ్స్‌ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) ఆసుపత్రి సిబ్బందితో దుష్ర్పవర్తనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సోమవారం జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జె.ఎన్.యు.) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ పై ఎఫ్.ఐ.ఆర్. దాఖలైంది. ఆ మర్నాడే బీహార్ లోని బెగూ సరాయ్ లో ఆయన మీద క్రూరమైన దాడి జరిగింది. ఆర్.ఎస్.ఎస్. అనుబంధ సంస్థ బజరంగ్ దళ్ కు చెందిన వారు ఈ దాడికి పాల్పడ్డారని అనుకుంటున్నారు.

కన్నయ్య కుమార్ మద్దతు దార్లకు, దాడి చేసిన బజరంగ్ దళ్ కార్యకర్తలకు మధ్య జరిగిన గొడవలో ఇద్దరికి గాయాలైనాయి. అనేక వాహనాలు ధ్వంసం అయినాయి అని పోలీసులు తెలియజేశారు.

భగ్వాన్ పూర్ గ్రామంలో ఒక సభలో మాట్లాడిన తర్వాత తన సొంత గ్రామం బీహాట్ కు వెళ్తుండగా కన్నయ్య పై ఈ దాడి చేశారు.

కన్నయ్య బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత దగ్గరలో ఉన్న మిత్రుడిని కలుసుకోవడానికి వెళ్తుండగా ఆయన మద్దతు దార్లు ఎక్కువ మంది ఉండడంతో ఆ వీధిలో రాకపోకలకు అంతరాయం కలిగింది అని పోలీసు అధికారి ఒకరు తెలియజేశారు.

కన్నయ్య మీద దాడి చేసింది బజరంగ్ దళ్ కార్యకర్తలేనని జె.ఎన్.యు. విద్యార్థి ఉమర్ ఖాలిద్ ట్విట్టర్ సందేశంలో ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News