యూపీలో వివాదం.... అలహాబాద్‌ పేరు మార్పు

యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంలోని యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలో చారిత్రక పట్టణమైన అలహాబాద్‌ పేరును మార్చేసింది. అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తూ యూపీ కేబినెట్ తీర్మానం చేసింది. అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలన్నది చాలా మంది కోరిక అని…. అందరూ అంగీకరిస్తే త్వరలోనే అది జరుగుతుందని చెప్పిన యోగి ఆ వెంటనే అన్నంత పనిచేశారు. కుంభమేళ కంటే ముందే పేరు మార్చాలనుకున్న యోగి ఆదిత్యనాథ్‌…. పేరు మారుస్తూ కేబినెట్‌లో తీర్మానం చేశారు. అలహాబాద్‌ […]

Advertisement
Update: 2018-10-16 02:55 GMT

యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంలోని యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలో చారిత్రక పట్టణమైన అలహాబాద్‌ పేరును మార్చేసింది. అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తూ యూపీ కేబినెట్ తీర్మానం చేసింది.

అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలన్నది చాలా మంది కోరిక అని…. అందరూ అంగీకరిస్తే త్వరలోనే అది జరుగుతుందని చెప్పిన యోగి ఆ వెంటనే అన్నంత పనిచేశారు. కుంభమేళ కంటే ముందే పేరు మార్చాలనుకున్న యోగి ఆదిత్యనాథ్‌…. పేరు మారుస్తూ కేబినెట్‌లో తీర్మానం చేశారు.

అలహాబాద్‌ పేరును మార్చడంపై కాంగ్రెస్ మండిపడింది. పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆందోళనకు దిగింది. హిందుత్వాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నంలో భాగంగానే అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News