అమ్మాయి కోసం ‘ఆర్ఎక్స్ 100’ హీరోలా ఆత్మహత్య....

క్షణికావేశం.. పైగా సినిమాల ప్రభావం.. తెలిసీ తెలియని 16 ఏళ్ల వయసు.. ఆ పదోతరగతి విద్యార్థుల అఘాయిత్యానికి దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారి కుటుంబీకులకు తీరని వేదన మిగిల్చింది. బుద్దిగా బడికి వెళ్లి చదువుకోవాల్సిన వారు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. దీనికి తోడు ఇటీవలే విడుదలైన ‘RX 100’ మూవీ ప్రభావం వారిపై పిచ్చిగా పడింది. దీంతో ప్రేమంటే ఏమిటో తెలియని నవయవ్వన వేడిలో వారు ప్రేమమైకంలో కూరుకుపోయారు. ప్రేమించిన వారు తమకు […]

Advertisement
Update: 2018-10-02 00:38 GMT

క్షణికావేశం.. పైగా సినిమాల ప్రభావం.. తెలిసీ తెలియని 16 ఏళ్ల వయసు.. ఆ పదోతరగతి విద్యార్థుల అఘాయిత్యానికి దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారి కుటుంబీకులకు తీరని వేదన మిగిల్చింది. బుద్దిగా బడికి వెళ్లి చదువుకోవాల్సిన వారు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. దీనికి తోడు ఇటీవలే విడుదలైన ‘RX 100’ మూవీ ప్రభావం వారిపై పిచ్చిగా పడింది.

దీంతో ప్రేమంటే ఏమిటో తెలియని నవయవ్వన వేడిలో వారు ప్రేమమైకంలో కూరుకుపోయారు. ప్రేమించిన వారు తమకు దక్కరని ఆర్ ఎక్స్ 100 హీరో చేసిన పనే చేయాలని అనుకున్నారు. కానీ అది రీల్ సీన్.. ఇది రియల్ సీన్.. అమ్మాయి కోసం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేయాలనుకున్నారు. కానీ ఆ పెట్రోల్ ఊరికే ఉండదు కదా.. ఆ విద్యార్థులను కాల్చేసింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఆదివారం రాత్రి ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మహేందర్, రవితేజ ఆత్మహత్య కేసులో ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు.

విద్యార్థుల ఆత్మహత్యకు గల మిస్టరీని పోలీసులు ఛేధించారు. బుద్దిగా చదువుకోవాల్సిన ఈ ఇద్దరు విద్యార్థులు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం కొనసాగించారు. విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో వీరిద్దరిని తీవ్రంగా మందలించారు.

ప్రేమ మత్తులో ఉన్న ఆ విద్యార్థులు ఇటీవల వచ్చిన ఆర్ఎక్స్ 100 హీరోను ఊహించుకొని ఇద్దరూ కలిసే ఆత్మహత్యయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసే పెట్రోల్ బంక్ కు వెళ్లి పెట్రోల్ కొనుగోలుచేశారు. అనంతరం మద్యం సేవించారు. ఆ మత్తులో ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్ఎక్స్ 100 సినిమాలోని సన్నివేశాలే ప్రభావితం చేశాయని జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ స్వయంగా మీడియాకు వివరాలు వెల్లడించడం విశేషం.

ఇలా సినిమాలు సమాజంపై ఎంతటి ప్రభావం చూపిస్తాయనడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. మసాలా కోసం.. ప్రేక్షకులను రంజింప చేయడం కోసం తీస్తున్న సినిమాలు అలరిస్తూనే ఉన్నాయి.. వాటిని ఆదర్శంగా తీసుకుంటున్న తెలిసితెలియని విద్యార్థులు మాత్రం బలైపోతున్నారు.

ఎవరి సైడ్ ఆలోచిస్తే వారిదే కరెక్టే.. కానీ మానసికంగా దృఢంగా లేని పిల్లలపై ఈ సినిమాల ప్రభావం తీవ్రంగా చూపుతోంది. అది ఎంతటి ఉపద్రవానికి దారితీస్తుందనేదానికి ఈ విద్యార్థుల సూసైడ్ గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.

Advertisement

Similar News