అమెరికా బ్లాక్ థండర్ వినూత్న ప్రచారం

బ్రెస్ట్ క్యాన్సర్ పై సెరెనా విలియమ్స్ పోరాటం…. టాప్ లెస్ గా పాటపాడుతూ బ్లాక్ థండర్ ప్రచారం…. ప్రపంచ మహిళా టెన్నిస్ లో గత దశాబ్దకాలంగా ఎందరో ప్రత్యర్థులతో పోరాడుతూ అసలు సిసలు విజేతగా నిలిచిన అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్…ఇప్పుడు మరో ప్రత్యర్థిపై తనదైన శైలిలో పోరాటం మొదలు పెట్టింది. నేటితరం మహిళలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రొమ్ము క్యాన్సర్ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనటానికి సెరెనా తనవంతు ప్రయత్నం ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మహిళల్లో… […]

Advertisement
Update: 2018-10-01 11:40 GMT
  • బ్రెస్ట్ క్యాన్సర్ పై సెరెనా విలియమ్స్ పోరాటం….
  • టాప్ లెస్ గా పాటపాడుతూ బ్లాక్ థండర్ ప్రచారం….

ప్రపంచ మహిళా టెన్నిస్ లో గత దశాబ్దకాలంగా ఎందరో ప్రత్యర్థులతో పోరాడుతూ అసలు సిసలు విజేతగా నిలిచిన అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్…ఇప్పుడు మరో ప్రత్యర్థిపై తనదైన శైలిలో పోరాటం మొదలు పెట్టింది.

నేటితరం మహిళలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రొమ్ము క్యాన్సర్ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనటానికి సెరెనా తనవంతు ప్రయత్నం ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మహిళల్లో… బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచడం కోసం తన స్టయిల్లో ప్రచారం చేపట్టింది.

టాప్ లెస్ సాంగ్….

రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసోత్సవం సందర్భంగా సెరెనా… ‘ఐ టచ్‌ మై సెల్ఫ్’ అనే పాటను పాడి మహిళాలోకాన్ని జాగృతం చేసింది. మహిళలు తమ వక్షోజాలను తరచుగా పరిశీలించుకోవాలని గుర్తు చేస్తూ ఆమె ఈ పాట పాడారు.

ఈ వీడియోను సెరెనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘‘ఇది నాకంత సౌకర్యంగా లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందర్నీ రొమ్ము క్యాన్సర్ ప్రభావితం చేస్తోంది, వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ పాటను ఆలపించినట్లు సెరెనా వివరించింది.

‘‘రొమ్ము కేన్సర్‌ను ముందుగానే గుర్తించడం ముఖ్యం. తరచూ పరీక్షలు చేసుకొంటూ ముందుగానే గుర్తించగలిగితే చాలా ప్రాణాలను కాపాడుకొనే అవకాశం ఉంటుందని సెరెనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

మహిళలు… తమ వక్షోజాలను తమకు తాముగా.. తరచు పరీక్షించుకోవాలనే విషయాన్ని తాను రూపొందించిన వీడియో గుర్తు చేస్తుందని ఆశిస్తున్నట్లు సెరెనా తెలిపింది.

Tags:    
Advertisement

Similar News