వైసీపీకి బొమ్మిరెడ్డి రాజీనామా

నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీలో విభేదాలు తలెత్తాయి. మొన్నటి వరకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని అందుకే రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. బొమ్మిరెడ్డి రాజీనామాకు ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడమే కారణంగా చెబుతున్నారు. ఇటీవల వైసీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డికి వెంటకగిరి నియోజకవర్గ బాధ్యతలను జగన్‌ అప్పగించారు. దాంతో అప్పటి వరకు ఇన్‌చార్జ్‌గా ఉన్న బొమ్మిరెడ్డి అలకబూనారు. కొద్ది రోజుల క్రితం జరిగిన […]

Advertisement
Update: 2018-09-22 01:59 GMT

నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీలో విభేదాలు తలెత్తాయి. మొన్నటి వరకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.

పార్టీలో తనకు అన్యాయం జరిగిందని అందుకే రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. బొమ్మిరెడ్డి రాజీనామాకు ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడమే కారణంగా చెబుతున్నారు.

ఇటీవల వైసీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డికి వెంటకగిరి నియోజకవర్గ బాధ్యతలను జగన్‌ అప్పగించారు. దాంతో అప్పటి వరకు ఇన్‌చార్జ్‌గా ఉన్న బొమ్మిరెడ్డి అలకబూనారు. కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీ సమన్వయకర్తల సమావేశానికి కూడా బొమ్మిరెడ్డి హాజరు కాలేదు.

వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి టికెట్ ఆనం నారాయణరెడ్డికేనని తేలిపోవడంతో బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి రాజీనామా చేశారు. తదుపరి ఆయన నిర్ణయం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News