మోదీని కలవనివ్వలేదని బస్సుకు నిప్పు పెట్టింది..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనివ్వలేదని ఓ మహిళలకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో ఓ బస్సుకు నిప్పుపెట్టింది. ఆ బస్సులో ప్రయాణీకులు కూడా ఉన్నారు. నిర్ఘాంత పరిచే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగింది. ప్రధానమంత్రి వారణాసి పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ స్టేట్‌ రోడ్‌వేస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (యూపీఎస్‌ఆర్‌టీసీ)కి చెందిన ఓ లగ్జరీ బస్సు అగ్నికి ఆహుతయ్యింది. మంటలు వ్యాపించకముందే ప్రయాణీకులందరినీ దించేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి ప్రత్యేక […]

Advertisement
Update: 2018-09-19 23:32 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనివ్వలేదని ఓ మహిళలకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో ఓ బస్సుకు నిప్పుపెట్టింది. ఆ బస్సులో ప్రయాణీకులు కూడా ఉన్నారు. నిర్ఘాంత పరిచే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగింది. ప్రధానమంత్రి వారణాసి పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ స్టేట్‌ రోడ్‌వేస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (యూపీఎస్‌ఆర్‌టీసీ)కి చెందిన ఓ లగ్జరీ బస్సు అగ్నికి ఆహుతయ్యింది. మంటలు వ్యాపించకముందే ప్రయాణీకులందరినీ దించేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఉత్తరప్రదేశ్‌ నుంచి ప్రత్యేక పూర్వాంచల్‌ రాష్ట్రం ఏర్పాటుచేయాలని ఉద్యమిస్తున్న వారిలో ఒకరిగా ఆ మహిళను గుర్తించారు. ఆమె పేరు వందనా రఘువంశి. ఈ ఘటన నేపథ్యంలో ఆమెను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారణాసిలోని కంటోన్మెంట్‌ బస్‌స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ మహిళ బస్సుపై పెట్రోలు చల్లి ఆ పై నిప్పు అంటించింది. మంటలు శరవేగంగా వ్యాపించడంతో ప్రయాణికులను హుటాహుటిన కిందికి దించారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందికి గంటకు పైగానే సమయం పట్టింది.

పూర్వాంచల్‌ డిమాండ్‌ పై రఘువంశి ఆగస్టు 15న ఆమరణ దీక్షకు కూర్చున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆగస్టు 29న ఆమెను బలవంతంగా ఆసుపత్రికి తరలించారని జిల్లా ఎస్పీ దినేష్‌ కుమార్‌ చెప్పారు. మోదీ రెండు రోజులపాటు వారణాసిలో పర్యటించారు. పుట్టిన రోజును కూడా ఇక్కడే జరుపుకున్నారు. అయితే ప్రధానిని కలుసుకునేందుకు విఫలయత్నం చేసిన రఘువంశి ఆగ్రహంతో బస్సుకు నిప్పు పెట్టారని ఎస్పీ తెలిపారు.

Advertisement

Similar News