అసెంబ్లీ వద్ద  ల్యాప్‌టాప్‌లో జేసీ వీడియో ప్రదర్శన

ప్రబోధానంద ఆశ్రమ వివాదంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన ఆయన.. అక్కడ ప్రబోధానందకు సంబంధించిన బూతు ప్రవచనలను ల్యాప్‌టాప్‌లో ప్రదర్శించారు. ప్రబోధానంద కోసం అవసరమైతే తమ పార్టీ ధర్నాలు చేస్తుందంటూ జగన్ చేసిన ప్రకటనతో పాటు.. గతంలో సాక్షి టీవీ ప్రబోధానంద ఆశ్రమంలో ఆరాచకాలు జరుగుతున్నాయంటూ ప్రసారం చేసిన కథనాన్ని కూడా జేసీ ప్రదర్శించారు. ఇలాంటి డేరా బాబాలకు ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. […]

Advertisement
Update: 2018-09-19 04:52 GMT

ప్రబోధానంద ఆశ్రమ వివాదంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన ఆయన.. అక్కడ ప్రబోధానందకు సంబంధించిన బూతు ప్రవచనలను ల్యాప్‌టాప్‌లో ప్రదర్శించారు. ప్రబోధానంద కోసం అవసరమైతే తమ పార్టీ ధర్నాలు చేస్తుందంటూ జగన్ చేసిన ప్రకటనతో పాటు.. గతంలో సాక్షి టీవీ ప్రబోధానంద ఆశ్రమంలో ఆరాచకాలు జరుగుతున్నాయంటూ ప్రసారం చేసిన కథనాన్ని కూడా జేసీ ప్రదర్శించారు.

ఇలాంటి డేరా బాబాలకు ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. ప్రబోధానంద అనుచరుల చేతిలో గాయపడిన వారిలో వైసీపీ వాళ్లు కూడా ఉన్నారన్నారు. పోలీసులకు యూనియన్ ఉంది కదాని తాను భయపడేవాడిని కాదన్నారు. తానేమీ విజయవాడ, విశాఖలో ఉండే పోలీసులను తప్పుపట్టలేదని… స్థానికంగా ఉన్న పోలీసులే పూర్తిగా విఫలమయ్యారని విమర్శించానని చెప్పారు.

ఆశ్రమంలోని గుండాలు రాళ్లు రువ్వితే నలుగురు ఎస్పీల సమక్షంలోనే 150 మంది పోలీసులు పరుగులు తీయడం డిపార్ట్‌మెంట్‌కే అవమానం కాదా అని ప్రశ్నించారు. నలుగురు ఎస్పీలతో సహా 15మంది పోలీసు ఉన్నతాధికారులు పెళ్లికొడుకుల తరహాలో చూస్తూ నిలబడ్డారని విమర్శించారు. కనీసం గాల్లోకి కాల్పులు కూడా జరపలేని స్థితికి అక్కడి పోలీసులు ఎందుకు వచ్చారని జేసీ ప్రశ్నించారు.

చివరకు తన ఆందోళన తర్వాత 15వందల మంది పోలీసులను రప్పించుకున్నారని.. అప్పటి వరకు ఆశ్రమం యొక్క గేటును కూడా పోలీసులు తాకలేకపోయారని జేసీ ఫైర్ అయ్యారు.

ఆశ్రమం లోపల తనిఖీలు చేస్తే ఆయుధాలు, నకిలీ ఆధార్‌, రేషన్ కార్డులు దొరికాయన్నారు. ప్రబోధానంద అనే దరిద్రపు నాకొడుకు ముగ్గురిని హత్య కూడా చేశారని… ఇది వరకే శిక్ష కూడా పడితే పైకోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నారని జేసీ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News