గుంటూరు అతలాకుతలం

భారీ వర్షాలకు గుంటూరుజిల్లా అతలాలకుతలం అయింది. వరద ధాటికి రైల్వే ట్రాకులే కొట్టుకుపోయాయి. గుంటూరు- సత్తెనపల్లి మార్గంలో రైల్వే ట్రాక్‌ కొట్టుకుపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. ఇదే సమయంలో విజయవాడలో రూట్ రిలే ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ ఆధునీకరణ పనులు కూడా జరుగుతుండడంతో భారీగా రైళ్లు రద్దయ్యాయి. గుంటూరు- సత్తెనపల్లి మార్గంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో గురువారం 40కిపైగా రైళ్లను రద్దు చేశారు. ఏడు చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఇప్పటికీ ట్రాక్‌లపై వరద నీరు […]

Advertisement
Update: 2016-09-22 21:56 GMT

భారీ వర్షాలకు గుంటూరుజిల్లా అతలాలకుతలం అయింది. వరద ధాటికి రైల్వే ట్రాకులే కొట్టుకుపోయాయి. గుంటూరు- సత్తెనపల్లి మార్గంలో రైల్వే ట్రాక్‌ కొట్టుకుపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. ఇదే సమయంలో విజయవాడలో రూట్ రిలే ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ ఆధునీకరణ పనులు కూడా జరుగుతుండడంతో భారీగా రైళ్లు రద్దయ్యాయి. గుంటూరు- సత్తెనపల్లి మార్గంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో గురువారం 40కిపైగా రైళ్లను రద్దు చేశారు. ఏడు చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఇప్పటికీ ట్రాక్‌లపై వరద నీరు ప్రవహిస్తోంది. పలుచోట్ల రైల్వే ట్రాక్‌ కింద మట్టికొట్టుకుపోయింది. పిడుగురాళ్ల, బెల్లంకొండ మధ్య ట్రాక్‌పై వరదనీళ్లు చేరడంతో ఫలక్‌నుమాను కొనంకి రైల్వే గేటు వద్ద నిలిపివేశారు. రెడ్డిగూడేనికి ఇరువైపులా ట్రాక్ దెబ్బతినడంతో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ ను రెడ్డిగూడెం స్టేషన్‌లోనే ఆపేశారు. ఈ రెళ్లలో దాదాపు 4వేల మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. గుంటూరు- నడికుడి- సికింద్రాబాద్ మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి.

అటు గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు ముఖ్యంగా పల్నాడు ప్రాంతం వణికిపోయింది. పల్నాడు ప్రాంతంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పల్నాడులో సగటున 20సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నకరికల్లులో అత్యధికంగా 24.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కొండవీటి వాగు ఉధృతికి మేడికొండూరు వద్ద నిర్మిస్తున్న వంతెన అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. గుంటూరు జిల్లాలో వర్షాలకు ఇప్పటి వరకు 9మంది చనిపోయారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో పలుచోట్ల వంతెనలు,రోడ్లు దెబ్బతిన్నాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News