ఓపెన్ సీక్రెట్ ను చింపి చాప చేసిన దాసరి

నిన్నటి వరకు అది ఓపెన్ సీక్రెట్. అందరికీ తెలుసు కానీ పబ్లిక్ గా మాత్రం మాట్లాడేవారు కాదు. అలాంటి బహిరంగ రహస్యాన్ని మరింత బహిరంగం చేశారు దర్శక రత్న దాసరి. మొన్నటివరకు ముసుగులో  గుద్దులాటగా ఉన్న వ్యవహారాన్ని కాస్తా… పబ్లిక్ గా మాట్లాడి చేటను చాపంత చేసి చూపించారు. అదే నాగచైతన్య-సమంత ప్రేమ వ్యవహారం.   వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని అందరికీ తెలుసు. నాగార్జున కూడా సమంతపై క్లారిటీ ఇచ్చేశాడు. కానీ సమంత […]

Advertisement
Update: 2016-09-21 13:20 GMT
నిన్నటి వరకు అది ఓపెన్ సీక్రెట్. అందరికీ తెలుసు కానీ పబ్లిక్ గా మాత్రం మాట్లాడేవారు కాదు. అలాంటి బహిరంగ రహస్యాన్ని మరింత బహిరంగం చేశారు దర్శక రత్న దాసరి. మొన్నటివరకు ముసుగులో గుద్దులాటగా ఉన్న వ్యవహారాన్ని కాస్తా… పబ్లిక్ గా మాట్లాడి చేటను చాపంత చేసి చూపించారు. అదే నాగచైతన్య-సమంత ప్రేమ వ్యవహారం.
వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని అందరికీ తెలుసు. నాగార్జున కూడా సమంతపై క్లారిటీ ఇచ్చేశాడు. కానీ సమంత మాత్రం ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. చైతూ అయితే అసలు మీడియాకే దొరకలేదు. కానీ దాసరి మాత్రం మీడియాకు ఫుల్లుగా సమాచారం అందించారు. ప్రేమమ్ ఆడియో వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరైన దాసరి…నాగచైతన్య నవ్వు చాలా బాగుంటుందని మెచ్చుకున్నారు. ఆ నవ్వుతోనే ఏమాయచేసావె సినిమా నుంచి ఓ అమ్మాయిని మాయచేశాడని చమత్కరించారు. దీంతో అంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు.
Tags:    
Advertisement

Similar News