అల్లుడు ఆస్పత్రిలో... విడాకులకు కూతురు దరఖాస్తు

సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్నకూతురు సౌందర్య తన భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. ఈ విషయాన్ని సౌందర్య కూడా ట్వీట్టర్లో ధృవీకరించారు. ఏడాదిగా తామిద్దరం దూరంగా ఉంటున్నామని చెప్పారు. అయితే ఇది తమ కుటుంబానికి సంబంధించిన విషయం అని… తమ కుటుంబ ప్రైవసీకి ఇబ్బంది కలిగించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.  సౌందర్యకు ఆరేళ్ల క్రితం చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌తో వివాహం జరిగింది. మొదట్లో సాఫీగా […]

Advertisement
Update: 2016-09-16 09:26 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్నకూతురు సౌందర్య తన భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. ఈ విషయాన్ని సౌందర్య కూడా ట్వీట్టర్లో ధృవీకరించారు. ఏడాదిగా తామిద్దరం దూరంగా ఉంటున్నామని చెప్పారు. అయితే ఇది తమ కుటుంబానికి సంబంధించిన విషయం అని… తమ కుటుంబ ప్రైవసీకి ఇబ్బంది కలిగించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

సౌందర్యకు ఆరేళ్ల క్రితం చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌తో వివాహం జరిగింది. మొదట్లో సాఫీగా నడిచిన వీరి కాపురం తర్వాత ఇబ్బందుల్లో పడింది. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కూతురు కాపురాన్ని చక్కదిద్దేందుకు రజనీ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే… అశ్వీన్‌ రామ్‌ కుమార్‌ కిడ్నీ మార్పిడి కోసం అమెరికా వెళ్లారు. విడాకులకు అశ్విన్ కూడా ఓకే చేసినట్టు చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News