స్వర్గస్తులూ కరివేపాకులే...

తెలుగు గ్లోబల్ .కామ్- అనురాధ. చిత్తూరు దివంగత మేయర్. మేనల్లుడి చేతిలోనే భర్తతో పాటు కార్పొరేషన్‌ కార్యాలయంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అనురాధ కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటించారు. కానీ రాజకీయంగా బలమైన భార్యాభర్తలిద్దరూ చనిపోయాక ఇక ఆ కుటుంబంతో పనేముందనుకున్నారో గానీ టీడీపీ హ్యాండ్ ఇచ్చింది. చివరకు మా పరిస్థితి ఏమిటని అనురాధ కుమారుడు పార్టీ సమావేశంలో ఆవేదన చెందే పరిస్థితి వచ్చింది. బుధవారం చిత్తూరులో నగర టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. […]

Advertisement
Update: 2016-09-15 04:02 GMT

తెలుగు గ్లోబల్ .కామ్- అనురాధ. చిత్తూరు దివంగత మేయర్. మేనల్లుడి చేతిలోనే భర్తతో పాటు కార్పొరేషన్‌ కార్యాలయంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అనురాధ కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటించారు. కానీ రాజకీయంగా బలమైన భార్యాభర్తలిద్దరూ చనిపోయాక ఇక ఆ కుటుంబంతో పనేముందనుకున్నారో గానీ టీడీపీ హ్యాండ్ ఇచ్చింది. చివరకు మా పరిస్థితి ఏమిటని అనురాధ కుమారుడు పార్టీ సమావేశంలో ఆవేదన చెందే పరిస్థితి వచ్చింది. బుధవారం చిత్తూరులో నగర టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే మేయర్‌ పీఠాన్ని ఆశిస్తున్న టీడీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. తొలుత మాట్లాడిన కఠారి ప్రవీణ్… పార్టీ తమకు తీవ్ర అన్యాయం చేస్తోందని వాపోయారు. పార్టీ కోసం తన తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయినా తమకు మాత్రం పార్టీ న్యాయం చేయడం లేదంటూ ఆవేదన చెందారు. మేయర్ పీఠం తమ కుటుంబానికి దక్కకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే వెంటనే మేయర్ ఎన్నిక నిర్వహించాలంటూ టీడీపీ నగర అధ్యక్షుడు మాపాక్షి మోహన్ .. వైసీపీ నేతల చేత హైకోర్టులో పిటిషన్ వేయించారని కఠారి వర్గం ఆరోపించింది. అసలు 33వ వార్డుకు ఉప ఎన్నిక నిర్వహించకుండానే మేయర్‌ ఎన్నిక చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

సొంత పార్టీ వారే తమకు ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో మాపాక్షి మోహన్ జోక్యం చేసుకున్నారు. వైసీపీ నేతలతో తాను పిటిషన్ వేసినట్టు నిరూపించాలని సవాల్ చేశారు. దీంతో ఆయనపై కఠారి వర్గానికి చెందిన వారు పిడిగుద్దులు కురిపించారు. తమ వద్ద వీడియో సాక్ష్యం కూడా ఉందని ప్రకటించారు. అయితే కాపు సామాజికవర్గానికి చెందిన కఠారి కుటుంబానికి మేయర్ పదవి దక్కకుండా జాప్యం వెనుక టీడీపీ పెద్దల హస్తమే ఉందని కఠారి వర్గం అనుమానం. చంద్రబాబు సొంత జిల్లాలో ఆయనకు తెలియకుండా మేయర్ ఎన్నికలో నాటకాలు ఎలా నడుస్తాయని ప్రశ్నిస్తున్నారు. కఠారి ప్రవీణ్ ఎంత ఆవేదన చెందినా… ఆయన కుటుంబానికి మేయర్ పీఠం దక్కడం సాధ్యం కాదని టీడీపీ నేతలే చెబుతున్నారు. కఠారి అనురాధ, కఠారి మోహన్‌లు రాజకీయంగా బలంగా ఉండేవారని .. కానీ వారి కుటుంబసభ్యులకు అంత శక్తి లేదన్నది టీడీపీ అధినాయకత్వం భావన అని చెబుతున్నారు. అయితే కఠారి అనురాధ కుటుంబసభ్యుల శక్తిసామర్థ్యాలు పక్కన పెడితే ఇంటిపెద్దలిద్దరినీ కోల్పోయిన వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉంటుందన్నది మరికొందరి వాదన. ఈ వాదనలు ఎలా ఉన్నా చంద్రబాబుకు ఒక లెక్క ఉంటుంది కదా. ముందే చిత్తూరు…. ఆయన సొంత జిల్లా కూడాను.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News