హాస్య నటుడికి ఏడుపే మిగిలింది

బాలీవుడ్‌ హాస్య నటుడు కపిల్‌ శర్మ తన ఆఫీసు నిర్మాణానికి అనుమతికోసం బి.యం.సి కి దరఖాస్తు చేయగా బి.యం.సి అధికారి ఒకరు అందుకు ఐదు లక్షల లంచం అడిగాడు. అందుకు మండిపడ్డ కపిల్‌ శర్మ తాము అధికారంలోకి వస్తే మంచి రోజులు వస్తాయంటూ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన ప్రచార నినాదాన్ని గుర్తుచేస్తూ ఇవేనా మంచి రోజులు అంటూ ప్రధాని మోడీకి ట్వీట్‌ చేశాడు. దీనికి నెటిజన్‌లలో విశేష స్పందన లభించింది. దాంతో అధికార […]

Advertisement
Update: 2016-09-14 01:24 GMT

బాలీవుడ్‌ హాస్య నటుడు కపిల్‌ శర్మ తన ఆఫీసు నిర్మాణానికి అనుమతికోసం బి.యం.సి కి దరఖాస్తు చేయగా బి.యం.సి అధికారి ఒకరు అందుకు ఐదు లక్షల లంచం అడిగాడు. అందుకు మండిపడ్డ కపిల్‌ శర్మ తాము అధికారంలోకి వస్తే మంచి రోజులు వస్తాయంటూ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన ప్రచార నినాదాన్ని గుర్తుచేస్తూ ఇవేనా మంచి రోజులు అంటూ ప్రధాని మోడీకి ట్వీట్‌ చేశాడు. దీనికి నెటిజన్‌లలో విశేష స్పందన లభించింది. దాంతో అధికార బీజేపీ పార్టీకి చిర్రెత్తుకొచ్చింది.

ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. కపిల్‌ శర్మ నిబంధనలు ఉల్లంఘించి అక్రమనిర్మాణానికి పాల్పడ్డాడని, ఆ ప్రాంతంలో శర్మతోపాటు 50-60 మంది అటవీశాఖ నిబంధనలను అతిక్రమించారని, తమ నిర్మాణాలకోసం మడ అడవికి హాని కలిగించారని పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. అందరిలాగ సర్దుకుపోక అనవసరంగా ఎందుకు ట్వీట్‌ చేశానా అని ఇప్పుడు కపిల్‌ శర్మ కన్నీళ్ల పర్యంతం అవుతున్నాడు.

మోడీని విమర్శించినందుకే కపిల్‌ శర్మను కేసులో ఇరికించారని, బీజేపీ ప్రభుత్వ అవినీతిని ప్రస్తావించినందుకే ఆయనను వేధిస్తున్నారని, దేశంలోని ఇళ్లు, ఆఫీసుల నిర్మాణాల్లో ఎక్కువ శాతం మంది ఎంతోకొంత నిబంధనలను అతిక్రమిస్తూనే ఉన్నారని అలా అతిక్రమించాడని కపిల్‌ శర్మపై కేసుపెట్టడం బీజేపీ కక్ష సాధింపు చర్యయేనని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News