టార్గెట్ 2019 అంటున్న జగన్

ప్రత్యేక హోదా అంశం ఇప్పట్లో సర్దుమణిగేలా లేదు. హోదా సాధన కోసం వైసీపీ అధ్యక్షుడు టార్గెట్ 2019 అని ప్రకటించారు. హోదా కోసం పోరాటం విరమించే ప్రసక్తే లేదని వచ్చే ఎన్నికల వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పారు. హోదా అంశాన్ని సజీవంగా ఉంచి వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీ అయితే హోదా ఇస్తుందో ఆ పార్టీకే మద్దతు ఇస్తామన్నారు. 2019 వరకు పోరాడి… హోదా ఇవ్వాల్సిన అనివార్యతను కేంద్రానికి కలిగిస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటు కూడా సాధ్యం […]

Advertisement
Update: 2016-09-10 00:54 GMT

ప్రత్యేక హోదా అంశం ఇప్పట్లో సర్దుమణిగేలా లేదు. హోదా సాధన కోసం వైసీపీ అధ్యక్షుడు టార్గెట్ 2019 అని ప్రకటించారు. హోదా కోసం పోరాటం విరమించే ప్రసక్తే లేదని వచ్చే ఎన్నికల వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పారు. హోదా అంశాన్ని సజీవంగా ఉంచి వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీ అయితే హోదా ఇస్తుందో ఆ పార్టీకే మద్దతు ఇస్తామన్నారు. 2019 వరకు పోరాడి… హోదా ఇవ్వాల్సిన అనివార్యతను కేంద్రానికి కలిగిస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటు కూడా సాధ్యం కాదనుకున్నామని… కానీ తెలంగాణ ప్రజలు సుధీర్గంగా పోరాటం చేసి సాధించుకున్నారన్నారు.

అలాగే హోదా కోసం కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పోరాటానికి కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. హోదా సాధన ఒక్క జగన్‌తోనే సాధ్యం కాదని… ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ మంత్రులు కూడా భాగస్వామ్యులుగా ఉన్నారని… హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం చెప్పిన తర్వాత వారేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏసీబీ కోర్టు ఓటుకు నోటు కేసులో ఆదేశాలు జారీ చేసిన తర్వాత చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. కేసుల నుంచి బయటపడేందుకు ఏపీప్రజలకు చంద్రబాబు వెన్నుపోటుపొడిచారని ఆరోపించారు. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత జగన్‌ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే రోజా కూడా వచ్చారు. జగన్ వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే హోదా అంశాన్ని 2019 ఎన్నికల వరకు వైసీపీ వదిలిపెట్టేలా లేదు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News