కేంబ్రిడ్జ్‌లో చేరనున్న బిచ్చగాడు...

జయవేల్‌కు తండ్రిలేడు. జీవనాధారం లేదు. తల్లి బిచ్చమెత్తుకుని కొడుకుని పోషించేది. ఆ ఆదాయం చాలక కొడుకు జయవేల్‌ కూడా బిక్షాటన చేసేవాడు. వీధిబాలల స్థితిగతులపై అధ్యయనం చేస్తున్న ముత్తురామన్‌ దంపతుల కళ్లల్లో పడ్డాడు జయవేల్‌. మాతో వస్తే ఆశ్రయమిచ్చి, చదివిస్తామని ఆ అబ్బాయికి, వాళ్ల అమ్మకు చెప్పారు ముత్తురామన్‌ దంపతులు. వాళ్ల మాటలు నమ్మలేదు. గతంలో అనేకమంది ఇలాగే సహాయం చేస్తామని తీసుకువెళ్లి వాళ్లతో ఫొటోలు దిగి, వాళ్లను అడ్డంపెట్టుకుని డబ్బుచేసుకున్నారు. ఆ అనుభవాలతో ముత్తురామన్‌ దంపతుల […]

Advertisement
Update: 2016-09-10 01:40 GMT

జయవేల్‌కు తండ్రిలేడు. జీవనాధారం లేదు. తల్లి బిచ్చమెత్తుకుని కొడుకుని పోషించేది. ఆ ఆదాయం చాలక కొడుకు జయవేల్‌ కూడా బిక్షాటన చేసేవాడు.

వీధిబాలల స్థితిగతులపై అధ్యయనం చేస్తున్న ముత్తురామన్‌ దంపతుల కళ్లల్లో పడ్డాడు జయవేల్‌. మాతో వస్తే ఆశ్రయమిచ్చి, చదివిస్తామని ఆ అబ్బాయికి, వాళ్ల అమ్మకు చెప్పారు ముత్తురామన్‌ దంపతులు. వాళ్ల మాటలు నమ్మలేదు. గతంలో అనేకమంది ఇలాగే సహాయం చేస్తామని తీసుకువెళ్లి వాళ్లతో ఫొటోలు దిగి, వాళ్లను అడ్డంపెట్టుకుని డబ్బుచేసుకున్నారు. ఆ అనుభవాలతో ముత్తురామన్‌ దంపతుల మాటలను వీళ్లు నమ్మలేదు. కానీ పట్టుబట్టి వాళ్లను నమ్మించి జయవేల్‌ను వాళ్లతో తీసుకువెళ్లారు. స్కూల్‌లో చేర్పించారు. అడుక్కునే సమయంలో ఒంటిమీద సరిగా బట్టలు లేకుండా వానలో, ఎండలో ఫుట్‌పాత్‌మీద గడిపిన జయవేల్‌కు స్కూల్‌కు వెళ్లడం సంతోషాన్ని ఇచ్చింది. పట్టుదలగా చదివాడు. ఇంటర్‌మీడియట్‌ మంచి ర్యాంకుతో పాసయ్యాడు. కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ నిర్వహించిన ఎంట్రెన్స్‌ పరీక్షలో పాసయ్యాడు. కేంబ్రిడ్జ్‌లో సీటు దొరికింది. త్వరలో కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో చేరనున్నాడు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News