పార్టీలో ఉంటే ఉండండి... పోతేపోండి..!

సిరిసిల్లా జిల్లా భౌగోళికంగా సాధ్యం కాదు.. ఆర్థికంగా మ‌న‌లేదు.. ద‌య‌చేసి అర్థం చేసుకోండి.. గ‌తంలో నేనెప్పుడూ సిరిసిల్ల‌ను జిల్లా చేస్తాన‌ని హామీ ఇవ్వ‌లేదు. కానీ, సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి కట్టుబ‌డి ఉన్నాను అని స్ప‌ష్టం చేశారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల‌లో రైల్వేలైను, మెడిక‌ల్ క‌ళాశాల, ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు ఇత‌ర శాశ్వ‌త అభివృద్ధి ప‌నులు చేప‌ట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపారు. ఈ మేర‌కు సిరిసిల్ల ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల ప్రాంతం జిల్లాగా మ‌నుగ‌డ సాధించ‌లేదు. […]

Advertisement
Update: 2016-09-09 00:24 GMT
సిరిసిల్లా జిల్లా భౌగోళికంగా సాధ్యం కాదు.. ఆర్థికంగా మ‌న‌లేదు.. ద‌య‌చేసి అర్థం చేసుకోండి.. గ‌తంలో నేనెప్పుడూ సిరిసిల్ల‌ను జిల్లా చేస్తాన‌ని హామీ ఇవ్వ‌లేదు. కానీ, సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి కట్టుబ‌డి ఉన్నాను అని స్ప‌ష్టం చేశారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల‌లో రైల్వేలైను, మెడిక‌ల్ క‌ళాశాల, ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు ఇత‌ర శాశ్వ‌త అభివృద్ధి ప‌నులు చేప‌ట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపారు. ఈ మేర‌కు సిరిసిల్ల ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల ప్రాంతం జిల్లాగా మ‌నుగ‌డ సాధించ‌లేదు. కానీ, ఈ ప్రాంతాన్ని జిల్లాకంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తాను అని లేఖ‌లో పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా అంటూ ప్ర‌తిపాద‌న వ‌చ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని అంగీక‌రించారు. సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించాకే జిల్లాల జాబితా నుంచి ఈ ప్రాంతాన్ని త‌ప్పించార‌ని వివ‌రించారు. తానుగానీ, త‌న‌పార్టీ నేత‌లుగానీ ఏనాడూ సిరిసిల్ల‌ను జిల్లా చేస్తామ‌ని హామీ ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.
ఈ లేఖ విడుద‌ల చేసే ముందు ప‌లు ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. సిరిసిల్ల‌ను జిల్లా చేయాలంటూ అన్ని పార్టీల నాయ‌కులు ఐకాస‌గా ఏర్ప‌డి ఉద్య‌మాలు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు హైద‌రాబాద్‌లో టీఆర్ ఎస్ నాయ‌కులు మంత్రి కేటీఆర్ ను ఆయ‌న నివాసంలో క‌లిసి జిల్లాను ఏర్పాటు చేయాల‌ని గ‌ట్టిగానే అడిగారని, దీనికి కేటీఆర్ కూడా అదే స్థాయిలో స్పందించినట్లు తెలిసింది. వ్య‌క్తుల ఆధారంగా జిల్లాల‌ను ఇవ్వ‌లేమ‌ని ఆయ‌న‌ తేల్చి చెప్పారు. అలా అయితే కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న గ‌జ్వేల్ జిల్లా కావాలి క‌దా! మ‌రి ఎందుకు కాలేదు? అని ఎదురు ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం. సిరిసిల్ల జిల్లా సాధ్యం కాదని, కావాలంటే ప‌ట్ట‌ణంలోని చౌర‌స్తాలోకి వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు తాను సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. ఇంత‌కు మించి తానేం చేయ‌లేన‌ని తేల్చేశారు. సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి విష‌యంలో త‌న‌పై న‌మ్మ‌క‌మున్న వారు పార్టీలో ఉండ‌వ‌చ్చ‌ని.. లేదంటే వెళ్లిపోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News