ఖాళీ సమయంలో కలరింగ్ వద్దు... ఎంగిలి మెతుకుల కోసం వెళ్లి ఉంటే...

ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి… ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే కమిషన్లు వస్తాయి కాబట్టే టీడీపీనేతలు ప్యాకేజ్‌ కోసం పాకులాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు రాష్ట్రాన్నే తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం హోదాకోసం హడావుడి చేసిన టీడీపీ నేతలు ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి రాగానే సైలెంట్ అయిపోయారని విమర్శించారు. ఐదేళ్లు కాదు 15ఏళ్లు హోదా కావాలన్న నేతలు ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్టు ఎందుకు […]

Advertisement
Update: 2016-09-07 02:48 GMT

ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి… ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే కమిషన్లు వస్తాయి కాబట్టే టీడీపీనేతలు ప్యాకేజ్‌ కోసం పాకులాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు రాష్ట్రాన్నే తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం హోదాకోసం హడావుడి చేసిన టీడీపీ నేతలు ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి రాగానే సైలెంట్ అయిపోయారని విమర్శించారు.

ఐదేళ్లు కాదు 15ఏళ్లు హోదా కావాలన్న నేతలు ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్టు ఎందుకు పారిపోతున్నారని రోజా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌పైనా ఆమె మండిపడ్డారు. షూటింగ్‌లు లేని ఖాళీ సమయంలో మీటింగ్‌లు పెట్టి కలరింగ్ ఇవ్వడం మానుకోవాలని పవన్‌కు సూచించారు. నిజంగా చిత్తశుద్ది ఉంటే జగన్‌ లాగా నిరంతరం పోరాటం చేయాలన్నారు. తొలినుంచి హోదా కోసం పోరాడుతున్న వైసీపీ క్రెడిట్‌ను కొట్టేసేందుకు ప్రభుత్వమే పవన్‌ మీటింగ్‌లకు స్పాన్సర్ చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం అండ ఉండబట్టే తిరుపతిలో రాత్రికిరాత్రి సభకు అనుమతులు, ఏర్పాట్లు సాధ్యమయ్యాయని రోజా చెప్పారు. ప్యాకేజ్‌ల కోసం ఖాళీ సమయాల్లో పనిచేసే వారు నాయకుడు కాలేరన్నారు. రాజధాని రైతుల కోసం గుంటూరు వెళ్లి అక్కడ పెరుగన్నం తినేసి హైదరాబాద్‌ వచ్చాక పవన్‌ ఎలా సైలెంట్ అయిపోయారో అందరూ చూశారన్నారు. తాను కూడా ఎంగిలి మెతుకులకు ఆశపడి వెళ్లి ఉంటే 19మంది ఎమ్మెల్యేల తరహాలోనే కోట్ల డబ్బుతో పాటు పదవులు వచ్చేవన్నారు. కానీ తాను అలాంటి వ్యక్తిని కాదన్నారు రోజా.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News