థర్టీ ఇయర్స్ ఫృధ్వీకి యాక్సిడెంట్

30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో పిచ్చ పాపులర్ అయిన ఫృధ్వి హాస్పిటల్ పాలయ్యాడు. ఊహించని విధంగా ప్రమాదానికి గురైన ఫృధ్విని హుటాహుటిన సమీప హాస్పిటల్ లో చేర్చారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు ప్రకటించారు. ప్రస్తుతం ఫృధ్వి కోలుకుంటున్నాడు. తనపై అభిమానాన్ని కురిపించిన పలువురు సినీప్రముఖులు, అభిమానులకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. అయితే ఫృద్ధికి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటూ చాలామంది చర్చించుకుంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న […]

Advertisement
Update: 2016-09-05 22:07 GMT

30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో పిచ్చ పాపులర్ అయిన ఫృధ్వి హాస్పిటల్ పాలయ్యాడు. ఊహించని విధంగా ప్రమాదానికి గురైన ఫృధ్విని హుటాహుటిన సమీప హాస్పిటల్ లో చేర్చారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు ప్రకటించారు. ప్రస్తుతం ఫృధ్వి కోలుకుంటున్నాడు. తనపై అభిమానాన్ని కురిపించిన పలువురు సినీప్రముఖులు, అభిమానులకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. అయితే ఫృద్ధికి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటూ చాలామంది చర్చించుకుంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న సినిమాలో ఫృధ్వి కూడా ఉన్నాడు. ఓ ఫైట్ సీక్వెన్స్ లో ఫృధ్వి కూడా నటించాల్సి ఉంది. అందులో భాగంగానే పట్టుతప్పి కింద పడిపోయాడు ఫృధ్వి. వెంటనే అలెర్ట్ అయిన యూనిట్, హుటాహుటిన ఫృధ్విని సమీపంలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు ఫృద్వి. టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ బిజీయస్ట్ కమెడియన్ అతడే. తాజాగా ఆయన నటించిన బాబు బంగారంలోని బత్తాయి బబ్జీ క్యారెక్టర్ కు మంచి పేరొచ్చింది.

Click to Read

అపరిచితుడికి ఇ‍ంకొకడి ద్వారా హిట్ కొడతాడా ?
Tags:    
Advertisement

Similar News