బన్నీ భామలు సెట్ అయ్యారు...

అల్లు అర్జున్ కొత్త సినిమా డీజే. ఇక్కడ డీజే అంటే దువ్వాడ జగన్నాధమ్. ఇలా పేరుతోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మొన్నటివరకు చర్చ సాగింది. తాజాగా ఆ సస్పెన్స్ కూడా వీడింది. డీజే కోసం ఒకరు కాదు, ఏకంగా ఇద్దరు భామల్ని సెలక్ట్ చేశారు. వాళ్లే కాజల్, మెహరీన్. బన్నీ-కాజల్ కాంబో గురించి కొత్తగా చెప్పాల్సిందేం […]

Advertisement
Update: 2016-09-03 22:16 GMT

అల్లు అర్జున్ కొత్త సినిమా డీజే. ఇక్కడ డీజే అంటే దువ్వాడ జగన్నాధమ్. ఇలా పేరుతోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మొన్నటివరకు చర్చ సాగింది. తాజాగా ఆ సస్పెన్స్ కూడా వీడింది. డీజే కోసం ఒకరు కాదు, ఏకంగా ఇద్దరు భామల్ని సెలక్ట్ చేశారు. వాళ్లే కాజల్, మెహరీన్.

బన్నీ-కాజల్ కాంబో గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. గతంలో ఆర్య-2, ఎవడు సినిమాల్లో వాళ్ల మేజిక్ అందర్నీ కట్టిపడేసింది. అయితే మరో హీరోయిన్ మెహరీన్ తో మాత్రం బన్నీకి ఇదే తొలి చిత్రం. గతంలో నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో మెహరీన్ ఆకట్టుకుంది. లుక్స్ పరంగా ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ… అప్పట్లో ఆమె కాస్త లావుగా కనిపించేది. మరి ఇప్పుడు తగ్గిందేమో చూడాలి.

ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు హీరోయిన్లు ఫైనల్ అనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ఓ ప్రకటన రాబోతోంది. నిర్మాత దిల్ రాజు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి డీజే విశేషాల్ని వివరిస్తాడట. డీజే సినిమాకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు కూడా అప్పుడే తెలుస్తాయి.

Also Read
చైతూ సరసన సెట్ అయిపోయింది….

Hyper Movie Teaser

Full View

Tags:    
Advertisement

Similar News