మ‌రోసారి తెర‌పైకి కేపీసీ గాంధీ! 

ఓటుకు నోటు కేసు వెలుగుచూసిన సంద‌ర్భంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు తీసుకున్న ఓ నిర్ణ‌యం చాలామందిని విస్మ‌యానికి, ఆశ్చ‌ర్యానికి  గురిచేసింది. అదే ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా కేపీసీ గాంధీని నియ‌మించ‌డం. అంతేకాదు, ఆయ‌న‌కు కేబినెట్ హోదా కూడా క‌ల్పించారు. అప్పుడు కేపీసీ గాంధీ ట్రూత్‌ల్యాబ్స్ అధినేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈయ‌న నియామ‌కం వెనక భారీ కుట్ర దాగి ఉంద‌ని చంద్ర‌బాబు ప్ర‌త్య‌ర్థులు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేశారు. గ‌తంలో ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో సుదీర్ఘ‌కాలం డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించడ‌మే ఇందుకు […]

Advertisement
Update: 2016-08-30 01:20 GMT
ఓటుకు నోటు కేసు వెలుగుచూసిన సంద‌ర్భంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు తీసుకున్న ఓ నిర్ణ‌యం చాలామందిని విస్మ‌యానికి, ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అదే ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా కేపీసీ గాంధీని నియ‌మించ‌డం. అంతేకాదు, ఆయ‌న‌కు కేబినెట్ హోదా కూడా క‌ల్పించారు. అప్పుడు కేపీసీ గాంధీ ట్రూత్‌ల్యాబ్స్ అధినేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈయ‌న నియామ‌కం వెనక భారీ కుట్ర దాగి ఉంద‌ని చంద్ర‌బాబు ప్ర‌త్య‌ర్థులు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేశారు. గ‌తంలో ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో సుదీర్ఘ‌కాలం డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించడ‌మే ఇందుకు కార‌ణమ‌ని ఆరోపించారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు బేరిమాడిన‌ట్లుగా చెబుతున్న ఆడియో టేపులు బ‌య‌ట‌ప‌డ్డాయి. వీటిని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ధ్రువీక‌రించాల్సి ఉంటుంది.
ఇక్క‌డే చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ చ‌తురుత‌ను ప్రద‌ర్శించార‌ని అంటున్నారు ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు. గ‌తంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌లో డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన గాంధీ ద్వారా అక్క‌డ ప‌నిచేసే ఉద్యోగుల‌ను మ‌భ్య‌పెట్టి సాక్ష్యాల‌ను తారుమారు చేయించే కుట్ర జ‌రుగుతోంద‌ని వారు అనుమానాలు వ్య‌క్తం చేశారు. లేదా కేసు నుంచి త‌న‌ను ఎలాగైనా బ‌య‌ట‌ప‌డేసేందుకు కేపీసీ గాంధీ ఇచ్చే సూచ‌న‌లు ప‌నికి వ‌స్తాయ‌న్న ఉద్దేశంతోనే చంద్ర‌బాబు ఆయ‌న‌ను ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నార‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. కార‌ణాలేదైనా ఆఘ‌మేఘాల మీద ఏపీ స‌ర్కారు కేపీసీ గాంధీని నియ‌మించ‌డం స‌హ‌జంగానే ప‌లు అనుమానాల‌కు తావిచ్చింది. ఓటుకు నోటు కేసును మ‌రోసారి విచారించ‌మ‌ని ప్ర‌త్యేకోర్టు ఏసీబీని ఆదేశించ‌డంతో కేపీసీ గాంధీ పేరు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి స్టీఫెన్స‌న్‌తో మాట్లాడింది చంద్ర‌బాబే అని ధ్రువ‌ప‌రిచే ఫోరెన్సిక్ నివేదిక ఫ‌లితాన్ని కూడా జోడించ‌డ‌మే చంద్ర‌బాబు మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డట్ల‌యింది. ఇప్పుడు కేపీసీ గాంధీ పాత్ర కీల‌కంగా మారింది. ఆయ‌న ఏపీ సీఎంకు ఎలాంటి సూచ‌న‌లు ఇస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News