కరువును ఎదుర్కోవడంలో విఫలమయ్యారు...

కరువును ఎదుర్కొవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శించారు. రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాల కోసం కేంద్రం రెండేళ్లలో రూ. 700 కోట్లు ఇస్తే ఇప్పటి వరకు కేవలం 14 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని విమర్శించారు. ఒకవైపు రాష్ట్రం దగ్గర నిధు లేవంటూ, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించడం ఏమిటిని ప్రశ్నించారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై మూడు నెలలవుతున్నా సగం పంట మాత్రమే సాగులోకి వచ్చిందన్నారు. కరువు ఇంత […]

Advertisement
Update: 2016-08-26 04:27 GMT

కరువును ఎదుర్కొవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శించారు. రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాల కోసం కేంద్రం రెండేళ్లలో రూ. 700 కోట్లు ఇస్తే ఇప్పటి వరకు కేవలం 14 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని విమర్శించారు. ఒకవైపు రాష్ట్రం దగ్గర నిధు లేవంటూ, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించడం ఏమిటిని ప్రశ్నించారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై మూడు నెలలవుతున్నా సగం పంట మాత్రమే సాగులోకి వచ్చిందన్నారు. కరువు ఇంత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్ళు తెచ్చి కృష్ణా డెల్టాకు నీరందిస్తామని ప్రభుత్వం చెప్పిందని అయితే ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సగం విస్తీర్ణం మాత్రమే సాగులోకి వచ్చిందని ఈ పరిస్థితిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. వేసిన పంట కూడా ఎండిపోతుందని ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి జిల్లాల్లోనూ వరి పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే ఆరు లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తే ఇప్పటికే రెండు లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయిందని మధు చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన నిధులు దారి మళ్లించకుండా సదరు ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలన్నారు. రైతులకు రుణాలు ఇవ్వలేని ప్రభుత్వం దుబారా ఖర్చు విషయంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదని మధు మండిపడ్డారు.

Full View

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News