నన్ను కావాలనే వ్యభిచారం కేసులో ఇరికించారు...

ఎన్నో చిత్రాల్లో హుందాగా నటించి ఎందరో అభిమానులను సంపాదించుకున్న నటి యమున. ఒకప్పుడు అగ్రహీరోలకు కూడా కాల్‌షీట్లు ఇవ్వలేని స్థాయిలో యమున కేరీర్ నడిచింది. ఆమె చేసిన క్యారెక్టర్ల వల్ల ఆమెను చాలా మంది ఇష్టపడేవారు. అయితే 2011లో ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. బెంగళూరులో వ్యభిచారం కేసులో ఆమె అరెస్ట్ అవడం సంచలనం సృష్టించింది. అయితే దానిపై తొలిసారిగా యమున ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. తనను కొందరు కుట్ర చేసి ఇరికించారని నాటి ఘటనను తలుచుకుని […]

Advertisement
Update: 2016-08-21 05:52 GMT

ఎన్నో చిత్రాల్లో హుందాగా నటించి ఎందరో అభిమానులను సంపాదించుకున్న నటి యమున. ఒకప్పుడు అగ్రహీరోలకు కూడా కాల్‌షీట్లు ఇవ్వలేని స్థాయిలో యమున కేరీర్ నడిచింది. ఆమె చేసిన క్యారెక్టర్ల వల్ల ఆమెను చాలా మంది ఇష్టపడేవారు. అయితే 2011లో ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. బెంగళూరులో వ్యభిచారం కేసులో ఆమె అరెస్ట్ అవడం సంచలనం సృష్టించింది. అయితే దానిపై తొలిసారిగా యమున ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. తనను కొందరు కుట్ర చేసి ఇరికించారని నాటి ఘటనను తలుచుకుని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

తాను ఐటీసీ హోటల్‌కు వెళ్లలేదని చెప్పారు. ఒకవేళ వెళ్లి ఉంటే అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుంది కదా అని ప్రశ్నించారు. తప్పుడు కేసు కాబట్టే కోర్టు కూడా కొట్టివేసిందన్నారు. కేసు కొట్టివేసే వరకు ఐదేళ్ల పాటు తాను నిత్యం కుమిలిపోయానన్నారు. ఆరోజు తనను సీసీపీ ఆఫీస్‌ వాళ్లు ఏదో విచారణ పేరుతో పిలించారని ఆమె చెప్పారు. అక్కడికి వెళ్లగానే ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నట్టుగా చెప్పారన్నారు. దాంతో తాను షాక్ అయిపోయానన్నారు.

తన ఫోన్‌ ద్వారా కొందరు తనపై కుట్ర చేసి ఉంటారన్న అనుమానం ఉందన్నారు. కానీ లోతుల్లోకి వెళ్లి కనుక్కోనే ఆలోచన తనకు లేదన్నారు. ఆసమయంలో తన కుటుంబం, పిల్లలు తీవ్ర మానసిక ఇబ్బందిపడ్డారని కంటతడిపెట్టుకున్నారు. ఒక దశలో పిల్లల పేరిట వీలునామా రాసి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డానన్నారు. కానీ తన స్నేహితురాలు ఆ విషయం గమనించి ధైర్యం చెప్పిందన్నారు. ఆ రోజు తన పిల్లల కోసమే చావకుండా ధైర్యంగా నిలబడ్డానన్నారు.

నా క్యారెక్టర్ మంచిది కాదంటూ స్కూల్‌లో పెద్దఅమ్మాయిని ఇతర పిల్లలు దూరంగా పెట్టడం చాలా బాధకలిగించిందన్నారు. ఆ సమయంలో మీడియా కూడా తన పట్ల దారుణంగా వ్యవహరించిందని… దాన్ని ఎలా తట్టుకోవాలో కూడా అర్థం కాలేదన్నారు. ఒక ఆడది, ఆమెకు ఒక కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు అన్న ఆలోచన కూడా లేకుండా తనపై రాయకూడని వార్తలు రాశారని ఆవేదన చెందారు. అదే మీడియా తనపై కేసు కొట్టివేసినప్పుడు ఎలాంటి వార్తలు రాయలేదన్నారు. అరెస్ట్ అయిన తర్వాత వారం రోజుల పాటు నిద్రపోలేదన్నారు. తన ముఖాన్ని కూడా అద్దంలో చూసుకునేందుకు ఇష్టపడలేదని ఏడుస్తూ గడిపేశానన్నారు. చివరకు డిప్రెషన్లో ఉన్న తనను ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. అప్పటి వరకు టీవీల్లో వస్తున్న వార్తలను తాను చూడకుండా కుటుంబసభ్యులు జాగ్రత్తపడ్డారని చెప్పారు. కానీ ఆస్పత్రిలో టీవీ ఆన్ చేయగానే తనపై దారుణమైన కథనం వస్తోందని దాన్ని చూసి తట్టుకోలేకపోయానన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ విషయం తెలియడం వల్లే తన కుటుంబం అండగా నిలిచిందన్నారు. ఒకప్పుడు యమున లేకుంటే ఫంక్షన్‌లో కళ ఉండదని చెప్పిన బంధువులు కొందరు తర్వాత తనను పిలిచేందుకు కూడా ఇష్టపడలేదని చెప్పారు. ఆ సంఘటన తర్వాత తాను మానసికంగా చాలా బలపడ్డానని యమున చెప్పారు. ఏ సమస్యపైనైనా పోరాడవచ్చన్న ధైర్యం వచ్చిందన్నారు. జీవితంలో కర్ణుడిలా బతకూడదని కృష్ణుడిలాగే బతకాలన్నారు. కర్ణుడిలా అన్ని త్యాగాలకు సిద్ధపడుతూ పోతే తొక్కేస్తారని తన జీవిత పాఠాల సారాంశాన్ని వివరించారు యమున.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News