బావా, మ‌ర‌ద‌లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు

గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీం చేసిన అకృత్యాలు, సాగించిన వికృత క్రీడ‌లు ఒక్కోటి వెలుగుచూస్తున్నాయి. వీటి గురించి నిందితుల చెబుతున్న నిజాలు పోలీసుల‌కు హాలీవుడ్ సైకో సినిమాల‌ను గుర్తుకు తెప్పిస్తున్నాయి. త‌న‌, ప‌ర భేదం లేకుండా మ‌నుషుల‌ను పొట్ట‌న పెట్టుకుని త‌న ఇంట్లోనే శ‌వాల‌ను పాతిపెట్టాడ‌ని తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. న‌యీం అనుచ‌రురాలు ఫ‌ర్హానా, డ్రైవ‌ర్ భార్య ఆఫ్సాల‌ను విచారిస్తున్న పోలీసుల‌కు క‌ళ్లు చెదిరే వాస్త‌వాలు తెలుస్తున్నాయి. న‌యీం వ‌ల్ల వేధింపుల‌కు గురై క‌న‌బ‌డ‌కుండా పోయిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు […]

Advertisement
Update: 2016-08-18 20:01 GMT
గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీం చేసిన అకృత్యాలు, సాగించిన వికృత క్రీడ‌లు ఒక్కోటి వెలుగుచూస్తున్నాయి. వీటి గురించి నిందితుల చెబుతున్న నిజాలు పోలీసుల‌కు హాలీవుడ్ సైకో సినిమాల‌ను గుర్తుకు తెప్పిస్తున్నాయి. త‌న‌, ప‌ర భేదం లేకుండా మ‌నుషుల‌ను పొట్ట‌న పెట్టుకుని త‌న ఇంట్లోనే శ‌వాల‌ను పాతిపెట్టాడ‌ని తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. న‌యీం అనుచ‌రురాలు ఫ‌ర్హానా, డ్రైవ‌ర్ భార్య ఆఫ్సాల‌ను విచారిస్తున్న పోలీసుల‌కు క‌ళ్లు చెదిరే వాస్త‌వాలు తెలుస్తున్నాయి. న‌యీం వ‌ల్ల వేధింపుల‌కు గురై క‌న‌బ‌డ‌కుండా పోయిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు విచార‌ణ వేగ‌వంతం చేశారు సిట్ అధికారులు. ఇందులో భాగ‌గా ముందుగా క‌నిపించ‌కుండా పోయిన నయీం బంధ‌వుల కోసం వేట మొద‌లు పెట్టారు.
చాలాకాలంగా క‌న‌బ‌డ‌కుండా పోయిన‌ న‌యీం అక్క భ‌ర్త న‌దీమ్ (అలియాస్ విజ‌య్ కుమార్‌), త‌మ్ముడు అలీముద్దీన్ భార్య హీనా, కూతురు చియాన్‌తోపాటు, ఇంట్లో ప‌నిమ‌నిష‌గా చేసే దూర‌పు బంధువు న‌స్రీన్‌ల హ‌త్య‌ల‌కు సంబంధించిన కీల‌క విష‌యాలు విచార‌ణ‌లో వెలుగుచూశాయి. వీరంద‌రినీ న‌యీమే హ‌త్య చేసి ఉంటాడ‌ని పోలీసులు ఇంత‌కాలం అనుమానిస్తూ వ‌చ్చారు. ఇప్పుడు అదే నిజ‌మైంది. పోలీసుల విచార‌ణ‌లో ఫ‌ర్హానా, ఆఫ్సాలు ఆ న‌లుగురిని న‌యీమే హ‌త్య చేశాడ‌ని వెల్ల‌డించారు. వీరి శ‌వాల‌ను రాజేంద్ర‌న‌గ‌ర్ శివారులో నెక్నాంపూర్ లోని ఇంట్లోనే న‌యీం పాతిపెట్టాడ‌ని తెలిపారు. దీంతో ఓ ప్ర‌త్యేక బృందాన్ని గురువారం అర్ధారాత్రి నెక్నాంపూర్‌లోని న‌యీం ఇంటికి పంపారు పోలీసులు. వారు అక్క‌డ శ‌వాల‌ను పాతిపెట్టిన ఆన‌వాళ్ల‌ను గుర్తించినట్లు స‌మాచారం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News