అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌...స్టార్ హోట‌ల్‌లో దొంగ‌త‌నం!

సినిమాల్లో అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నఓ వ్య‌క్తి… స్నేహితుడి పుట్టినరోజుక‌ని ఓ స్టార్ హోట‌ల్‌కెళ్లాడు. అక్క‌డ ఓ గ‌దిలో బంగారు, డైమండ్ న‌గ‌లు దొంగ‌త‌నం చేసి బ‌య‌ట‌ప‌డ్డాడు. త‌మిళ‌నాడులోని  వ‌డ‌ప‌ళ‌నిలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. పి. అతీశ్వ‌ర‌న్ అనే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి బిజినెస్ ప‌నిమీద భార్య‌తో క‌లిసి చెన్నై వచ్చి వ‌డ‌ప‌ళ‌ని లోని ఓ స్టార్ హోటల్‌లో బ‌స‌చేశారు. ఆయ‌న… త‌మ గ‌దిలోని డ్రా సొరుగులో ఉంచిన రెండు డైమండ్ బ్రాస్‌లెట్స్, బంగారు ఉంగ‌రాలు, వాచీలు, […]

Advertisement
Update: 2016-08-18 22:26 GMT

సినిమాల్లో అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నఓ వ్య‌క్తి… స్నేహితుడి పుట్టినరోజుక‌ని ఓ స్టార్ హోట‌ల్‌కెళ్లాడు. అక్క‌డ ఓ గ‌దిలో బంగారు, డైమండ్ న‌గ‌లు దొంగ‌త‌నం చేసి బ‌య‌ట‌ప‌డ్డాడు. త‌మిళ‌నాడులోని వ‌డ‌ప‌ళ‌నిలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. పి. అతీశ్వ‌ర‌న్ అనే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి బిజినెస్ ప‌నిమీద భార్య‌తో క‌లిసి చెన్నై వచ్చి వ‌డ‌ప‌ళ‌ని లోని ఓ స్టార్ హోటల్‌లో బ‌స‌చేశారు. ఆయ‌న… త‌మ గ‌దిలోని డ్రా సొరుగులో ఉంచిన రెండు డైమండ్ బ్రాస్‌లెట్స్, బంగారు ఉంగ‌రాలు, వాచీలు, మూడు సెల్‌ఫోన్లు పోవ‌టంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు హోటల్ సిసిటివి ఫుటేజిని ప‌రిశీలించ‌గా ఓ వ్య‌క్తి అతీశ్వ‌ర‌న్ బ‌స‌చేసిన గ‌ది స‌మీపంలో త‌చ్చాడిన‌ట్టుగా క‌నిపించింది. దాంతో పోలీసులు ఆ వ్య‌క్తి ఆచూకీ కోసం ప్ర‌య‌త్నించి అత‌డిని ప‌ట్టుకున్నారు.

అత‌నిపేరు మ‌ణికంద‌న్ అలియాస్ హ‌రిప్ర‌కాష్‌. పుదుచ్చేరికి చెందిన‌వాడు. సినిమాల్లో అసిస్టెంట్ డైరక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న మ‌ణికంద‌న్ స్నేహితుని పుట్టిన‌రోజు పార్టీకి హాజ‌రు కావ‌డానికి ఆ హోట‌ల్‌కి వ‌చ్చాడు. అతీశ్వ‌ర‌న్ ఉన్న గ‌ది త‌లుపు తెరచి ఉండ‌టంతో లోప‌లికి వ‌చ్చి విలువైన వ‌స్తువుల‌ను దొంగ‌త‌నం చేశాడు. పోలీసులు అత‌డిని అరెస్టు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News