స్పీక‌ర్‌కు సుప్రీం నోటుసులు ఇబ్బందేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపులపై సుప్రీం స్పందించింది. త‌మ పార్టీ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదో వివ‌ర‌ణ ఇవ్వాలంటూ తెలంగాణ స్పీక‌ర్ మ‌ధుసుదనాచారికి నోటీసులు జారీ చేసింది. స‌మాధానం ఇచ్చేందుకు 3 వారాల గ‌డువు ఇచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. దీనిపై స్పీక‌ర్ ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మ పార్టీ నుంచి గెలిచి.. రాజీనామా చేయ‌కుండానే టీఆర్ ఎస్‌లో చేరార‌ని, దీనిపై స్పీక‌ర్‌కు ఫిర్యాదు […]

Advertisement
Update: 2016-08-18 00:51 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపులపై సుప్రీం స్పందించింది. త‌మ పార్టీ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదో వివ‌ర‌ణ ఇవ్వాలంటూ తెలంగాణ స్పీక‌ర్ మ‌ధుసుదనాచారికి నోటీసులు జారీ చేసింది. స‌మాధానం ఇచ్చేందుకు 3 వారాల గ‌డువు ఇచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. దీనిపై స్పీక‌ర్ ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మ పార్టీ నుంచి గెలిచి.. రాజీనామా చేయ‌కుండానే టీఆర్ ఎస్‌లో చేరార‌ని, దీనిపై స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆరోపిస్తూ ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంప‌త్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు.

తెలంగాణ‌లో టీడీపీ ఎమ్మెల్యేల విలీనం జ‌రిగినా.. దానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వ‌లేదు. వారంతా ఉమ్మ‌డిగా పార్టీ మారుతున్నామ‌ని, త‌మ ఎమ్మెల్యేల్లో మూడువంతుల మంది ఆమోదంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స్పీక‌ర్‌కు లేఖ స‌మ‌ర్పించారు. వెంట‌నే ఈ లేఖ‌కు ఆమోదం తెల‌ప‌డంతో వారి విలీన ప్ర‌క్రియ స‌మాప్త‌మైంది. దీంతో ఈ విష‌యంలో టీడీపీ నాయ‌కులెవ‌రూ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించే అవ‌కాశం లేకుండా పోయింది. కానీ, కాంగ్రెస్ మాత్రం ఈ వివాదాన్ని అంత తేలిగ్గా విడిచిపెట్ట ద‌లుచుకోలేదు. దీనిపై సుప్రీంకు వెళ్లింది. బుధ‌వారం ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు రావ‌డం, నోటీసులు జారీ చేయ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి మింగుడుప‌డ‌టం లేదు. మూడువారాల్లో స్పీక‌ర్ ఎలా స్పందిస్తారు? మ‌రింత స‌మ‌యం కోర‌తారా? లేక వేటు వేస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News