వారికి మాన‌సిక వైక‌ల్యం... వీరికి మ‌న‌సే లేదు!

వారంతా మాన‌సిక విక‌లాంగులు. త‌మ ప‌రిస్థితి బాగ‌వుతుంద‌ని మెంట‌ల్ ఆసుప‌త్రిలో చేరిన‌వారు. కానీ వారిని  ప‌ట్టించుకుని వ‌స‌తులు క‌ల్పించాల్సిన అధికారులయితే …అస‌లు మ‌న‌సే లేని విక‌లాంగులు. అందుకే వారికి  క‌నీస వ‌స‌తులు కూడా క‌ల్పించ‌కుండా  న‌ర‌కాన్ని చూపిస్తున్నారు. ఈ ప‌రిస్థితిని భ‌రించ‌లేక‌పోతున్న బాధితులు యాభై మంది పూర్తిగా దుస్తులు విప్పేసి…న‌గ్నత్వంతో త‌మ నిర‌స‌న‌ను తెలిపారు.  వీరిలో 20మంది మ‌హిళ‌లు ఉన్నారు. త‌మ దుస్తుల్లో క్రిములు చేరి ధ‌రించ‌డానికి వీలులేనంత‌గా పాడైపోయాయ‌ని, వాటిని ధ‌రించ‌డం కంటే న‌గ్నంగా ఉండ‌ట‌మే […]

Advertisement
Update: 2016-08-17 20:01 GMT

వారంతా మాన‌సిక విక‌లాంగులు. త‌మ ప‌రిస్థితి బాగ‌వుతుంద‌ని మెంట‌ల్ ఆసుప‌త్రిలో చేరిన‌వారు. కానీ వారిని ప‌ట్టించుకుని వ‌స‌తులు క‌ల్పించాల్సిన అధికారులయితే …అస‌లు మ‌న‌సే లేని విక‌లాంగులు. అందుకే వారికి క‌నీస వ‌స‌తులు కూడా క‌ల్పించ‌కుండా న‌ర‌కాన్ని చూపిస్తున్నారు. ఈ ప‌రిస్థితిని భ‌రించ‌లేక‌పోతున్న బాధితులు యాభై మంది పూర్తిగా దుస్తులు విప్పేసి…న‌గ్నత్వంతో త‌మ నిర‌స‌న‌ను తెలిపారు. వీరిలో 20మంది మ‌హిళ‌లు ఉన్నారు. త‌మ దుస్తుల్లో క్రిములు చేరి ధ‌రించ‌డానికి వీలులేనంత‌గా పాడైపోయాయ‌ని, వాటిని ధ‌రించ‌డం కంటే న‌గ్నంగా ఉండ‌ట‌మే మేల‌ని వారు చెబుతున్నారు. ప‌శ్చిమ‌ బెంగాల్‌, బెహ‌రాంపూర్‌లోని ఒక మెంట‌ల్ ఆసుప‌త్రిలోని మాన‌సిక విక‌లాంగుల కేంద్రంలో ఉంటున్న‌వారు అనుభ‌విస్తున్న దుస్థితి ఇది.

కోల్‌క‌తాలోని మాన‌సిక ఆరోగ్య హ‌క్కుల సంస్థ అంజ‌లికి చెందిన స‌భ్యులు ఈ విష‌యాల‌ను వెలుగులోకి తెచ్చారు. తాము బెహ‌రాంపూర్ మెంట‌ల్ హాస్ప‌ట‌ల్లోని ప‌రిస్థితుల‌ను అధికారుల దృష్టికి తీసుకువెళుతున్నా వారు స్పందించ‌డం లేద‌ని ఆ సంస్థ‌కు చెందిన సుమ‌నా భ‌ట్టాచార్య అన్నారు. వారానికి ఐదురోజులు అక్క‌డి పేషంట్ల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు తాము వెళుతుంటామ‌ని, పేషంట్లు నివ‌సిస్తున్న ప‌రిస్థితుల‌ను మాట‌ల‌తో చెప్ప‌లేమ‌ని ఆమె అన్నారు. సుమ‌న , మ‌రో మాన‌సిక ఆరోగ్య హ‌క్కుల కార్య‌క‌ర్త అదితి బ‌సు ఇద్ద‌రూ క‌లిసి ఈ విష‌యాల‌ను మీడియాద్వారా వెలుగులోకి తెచ్చారు. బెహ‌రాంపూర్ మాన‌సిక విక‌లాంగుల కేంద్రంలో ఉంటున్న కాజల్ మెహ‌తా అనే పేషంటు… తాము నివ‌సిస్తున్న దుర్భ‌ర వాతావ‌ర‌ణం గురించి చెబుతూ ….తాము ఉంటున్న గ‌దుల నేల‌, వాష్ రూములు అస‌లు మ‌నుషులు నివ‌సించ‌డానికి వీలులేన‌ట్టుగా తయార‌య్యాయ‌ని చెప్పారు. బాత్ రూముల్లో నీరు నిలిచిపోవ‌టంతో…పేషంట్లు కింద‌ప‌డి దెబ్బ‌లు త‌గిలించుకుంటున్నార‌ని, కొంత‌మందయితే కొన్ని నెల‌లుగా స్నానం చేయ‌కుండా అలాగే ఉంటున్నార‌ని ఆమె తెలిపారు. ఆసుప‌త్రిలో పేషంట్లు దుస్తులు లేకుండా ఉన్న విష‌యాన్ని అంజ‌లి సంస్థ స్థాప‌కురాలు ర‌త్న‌బోలి రాయ్‌…సూప‌రెంటెండెంట్‌ దృష్టికి తీసుకువెళ్ల‌గా…ఆయ‌న… ఆ పేషంట్లకు మ‌తి స్థిమితం లేద‌ని, అందుకే బ‌ట్టలు ధ‌రించ‌డం లేద‌ని చెప్పి ఊరుకున్నారు. మెంట‌ల్ ఆసుప‌త్రిలోని పేషంట్లు మాన‌సిక విక‌లాంగులో…వారిని ఆ స్థితిలో వ‌దిలేసిన దాని నిర్వాహ‌కులు మాన‌సిక విక‌లాంగులో తెలియ‌ని దుస్థితి ఇది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News