రాష్ట్రప‌తి ప్ర‌సంగం బీజేపీ స‌ర్కారుకు చుర‌క‌లేనా!

70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక‌ల సంద‌ర్భంగా రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ జాతిని ఉద్దేశించి చేసిన ప్ర‌సంగం ఆలోచింప‌జేస్తోంది. ముఖ్యంగా ద‌ళితులు, బ‌ల‌హీన వ‌ర్గాల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై ఆయ‌న తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి దాడుల‌ను అరిక‌ట్టకుంటే దేశ స‌మ‌గ్ర‌త‌కు ముప్పు వాటిల్లుతుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశ స‌మ‌గ్ర‌త విలువల‌ను దెబ్బ‌తీసే ఈ త‌ర‌హా విచ్చిన్న‌క‌ర శ‌క్తుల‌ను ఉపేక్షించ కూడద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గుజరాత్‌లోని ఉనా ప్రాంతంతోపాటు ప‌లుచోట్ల ద‌ళితుల‌పై జ‌రుగుతున్న, జ‌రిగిన […]

Advertisement
Update: 2016-08-14 23:11 GMT

70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక‌ల సంద‌ర్భంగా రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ జాతిని ఉద్దేశించి చేసిన ప్ర‌సంగం ఆలోచింప‌జేస్తోంది. ముఖ్యంగా ద‌ళితులు, బ‌ల‌హీన వ‌ర్గాల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై ఆయ‌న తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి దాడుల‌ను అరిక‌ట్టకుంటే దేశ స‌మ‌గ్ర‌త‌కు ముప్పు వాటిల్లుతుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశ స‌మ‌గ్ర‌త విలువల‌ను దెబ్బ‌తీసే ఈ త‌ర‌హా విచ్చిన్న‌క‌ర శ‌క్తుల‌ను ఉపేక్షించ కూడద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గుజరాత్‌లోని ఉనా ప్రాంతంతోపాటు ప‌లుచోట్ల ద‌ళితుల‌పై జ‌రుగుతున్న, జ‌రిగిన దాడులు జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళ‌న క‌లిగించిన విష‌యం తెలిసిందే. ఈ అంశాన్ని రాష్ట్రప‌తి త‌న ప్ర‌సంగంలో చేర్చ‌డం, అలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డిన వారిని ఉపేక్షించ కూడ‌దంటూ ప్ర‌భుత్వానికి హిత‌బోధ చేయ‌డం బీజేపీ ప్ర‌భుత్వానికి ప్ర‌ణబ్ అంటించిన చుర‌క‌లేన‌ని రాజ‌కీయ‌విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఇటీవ‌ల దేశంలో గోసంర‌క్ష‌కుల పేరుతో ఆవు చ‌ర్మం ఒలిచే ద‌ళితుల‌పై దాడులు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ కూడా వీటిపై స్పందించారు. ఆయ‌న స్పంద‌న చాలా విభిన్నంగా ఉంది. నిజ‌మైన గోర‌క్ష‌కులెవ‌రూ ఇలాంటి దాడుల‌కు పాల్ప‌డ‌ర‌ని, వారంతా న‌కిలీలేన‌ని స్ప‌ష్టం చేశారు. గోర‌క్ష‌కుల‌కు చెడ్డ పేరు తెచ్చేందుకే ఇలాంటి దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు బీజేపీ – వీహెచ్‌పీ మ‌ధ్య భేదాభిప్రాయాలకు దారి తీశాయి. తాజాగా రాష్ట్రప‌తి ప్ర‌సంగంలోనూ ఇదే అంశాన్ని ప్ర‌స్తావించ‌డం, ఈ త‌ర‌హా దాడుల‌ను అరికట్టాలని ఆయ‌న పిలుపునివ్వ‌డం ఒక‌ర‌కంగా దేశంలో ద‌ళితుల ద‌య‌నీయ ప‌రిస్థితికి అద్దం ప‌ట్టింద‌ని, ఇది ఒక‌ర‌కంగా బీజేపీ ప్ర‌భుత్వానికి రాష్ట్రప‌తి వేసిన మొట్టికాయ‌లుగానే చూడాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News