చదువులకన్నా సభలు ముఖ్యమా?

మా చదువులకన్నా మీ సభలు ముఖ్యమా అని మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా విద్యాకుంజ్‌ పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్ధి దైవాన్ష్‌జైన్‌ ప్రధాని మోడీని ప్రశ్నించాడు. ఈరోజు ఖాండ్వాకు సమీపంలో జరుగనున్న మెడీ సభకు జనాన్ని తరలించేందుకు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల స్కూల్‌ బస్సులను జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో సంబంధిత స్కూల్స్‌కు తొమ్మిది, పది తేదీలలో సెలవులు ప్రకటించారు. దానికి నిరసనగా దైవాన్ష్‌జైన్‌ ప్రధాని మోడీకి ఒక ఘాటు ఉత్తరం రాశాడు. మీ సభలకు జనాలను […]

Advertisement
Update: 2016-08-09 21:40 GMT

మా చదువులకన్నా మీ సభలు ముఖ్యమా అని మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా విద్యాకుంజ్‌ పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్ధి దైవాన్ష్‌జైన్‌ ప్రధాని మోడీని ప్రశ్నించాడు.

ఈరోజు ఖాండ్వాకు సమీపంలో జరుగనున్న మెడీ సభకు జనాన్ని తరలించేందుకు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల స్కూల్‌ బస్సులను జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో సంబంధిత స్కూల్స్‌కు తొమ్మిది, పది తేదీలలో సెలవులు ప్రకటించారు. దానికి నిరసనగా దైవాన్ష్‌జైన్‌ ప్రధాని మోడీకి ఒక ఘాటు ఉత్తరం రాశాడు. మీ సభలకు జనాలను తరలించడం కోసం మా బస్సులను తీసుకుంటే మాకు సెలవులు ప్రకటిస్తున్నారు. దాంతో మా చదువులు సాగడంలేదు. ఇలా చేయడం మీకు సమంజసమా? అని సూటిగా ప్రశ్నించాడు.

ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులు మేల్కొన్నారు. ప్రధాని సభకు స్కూలు బస్సులను తరలించాలన్న ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. సోషల్‌ మీడియాలో ఇంత ప్రచారం పొందిన ఈ ఉత్తరానికి మరి ప్రధాని మోడీ ఎలా స్పందిస్తాడో చూడాలి..!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News