కేంద్ర‌మంత్రి అనుప్రియా ప‌టేల్‌పై పోలీస్ కేసు!

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా స‌హాయ మంత్రి అనుప్రియా ప‌టేల్‌పై ఆదివారం ల‌క్నో పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని మీర్జాపూర్‌కి ఎంపిగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఆమె మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశాక తొలిసారి రాష్ట్ర‌రాజ‌ధాని ల‌క్నో వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆమెకి ఆహ్వానం ప‌లికేందుకు ఎయిర్‌పోర్టు వ‌ద్ద పెద్ద ఎత్తున జ‌నం గుమిగూడారు. అంతేకాక ఆమె ఎయిర్‌పోర్టునుండి బ‌య‌లుదేరిన త‌రువాత కూడా 200కంటే ఎక్కువ కార్లు ఆమె కాన్వాయ్‌ని అనుస‌రించాయి. అంబేద్క‌ర్ మ‌హాస‌భ‌, […]

Advertisement
Update: 2016-08-08 00:00 GMT

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా స‌హాయ మంత్రి అనుప్రియా ప‌టేల్‌పై ఆదివారం ల‌క్నో పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని మీర్జాపూర్‌కి ఎంపిగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఆమె మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశాక తొలిసారి రాష్ట్ర‌రాజ‌ధాని ల‌క్నో వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆమెకి ఆహ్వానం ప‌లికేందుకు ఎయిర్‌పోర్టు వ‌ద్ద పెద్ద ఎత్తున జ‌నం గుమిగూడారు. అంతేకాక ఆమె ఎయిర్‌పోర్టునుండి బ‌య‌లుదేరిన త‌రువాత కూడా 200కంటే ఎక్కువ కార్లు ఆమె కాన్వాయ్‌ని అనుస‌రించాయి. అంబేద్క‌ర్ మ‌హాస‌భ‌, స‌ర్దార్ వ‌ల్ల‌భాయి ప‌టేల్ స్మృతి చిహ్నం ప్ర‌దేశాల‌కు… ఆమె ప్ర‌యాణం చేసిన హ‌జ్ర‌త్ గంజ్ మార్గ‌మంతా కార్ల‌తో నిండిపోవ‌టంతో పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో వాహ‌న‌దారులు రెండు గంట‌ల‌పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.

400మీట‌ర్ల పొడ‌వున మంత్రిగారి వాహ‌నాలు ఆగిపోవ‌టంతో వాహ‌న‌దారులు ముందుకు వెళ్లే అవ‌కాశం లేక‌పోయింది. శ‌నివారం మ‌ధ్యాహ్నం ఈ సంఘ‌ట‌న చోటు చేసుకోగా ఆదివారం అనుప్రియా ప‌టేల్ ఆమె అనుచ‌రుల‌పై హ‌జ్ర‌త్ గంజ్ పోలీస్ స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ప‌టేల్ రావ‌టం వ‌ల‌న ల‌క్నోవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని హ‌జ్ర‌త్ గంజ్ పోలీస్ స్టేష‌న్ ఇన్‌ఛార్జ్…ఇన్‌స్పెక్ట‌ర్ విజ‌య్‌మాల్ యాద‌వ్ అన్నారు. ప‌టేల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా..మ‌ద్ద‌తుదారులు నిర్వ‌హించిన ర్యాలీకి ఎలాంటి ముందస్తు అనుమ‌తి తీసుకోలేద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ప‌టేల్ ప‌ర్య‌ట‌న‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చెల‌రేగ‌కుండా విధాన్ భ‌వ‌న్ మార్గ్‌లో 144 సెక్ష‌న్ విధించాల్సి వచ్చింద‌ని ఆయ‌న తెలిపారు. దారుల్ ష‌ఫా స్థానిక పోలీస్ ఔట్‌పోస్టు నుండి సబ్ఇన్‌స్పెక్ట‌ర్ సంజ‌య్ కుమార్ గుప్తా చేసిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్టుగా తెలిపారు. ప‌టేల్, 150 వాహ‌నాల్లో ఉన్న ఆమె అనుచ‌రుల‌పై ప్ర‌జాసేవ‌కురాలిగా అవిధేయ‌త‌, సాధార‌ణ ప్ర‌జాజీవితానికి భంగం క‌లిగించ‌డం… త‌దిత‌ర అభియోగాల‌తో కేసు న‌మోదు చేసిన‌ట్టుగా ల‌క్నోఅద‌న‌పు ఎస్‌పి తెలిపారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News