ఎక్క‌డి పాట అక్క‌డే పాడిన క‌మ‌ల‌నాథులు

‘ఎక్క‌డ మాట అక్క‌డే అప్ప‌జెప్ప‌డం’ అంటే ఏంటో బీజేపీ నేత‌ల‌నే చూసి నేర్చుకోవాలి. గ‌జ్వేల్ స‌భ‌లో మోదీ తెలంగాణ‌ను అభివృద్ధి చేస్తాం, మీకు తోడుగా ఉంటాం అని భ‌రోసా ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం త‌ప‌న ప‌డుతున్నారు. త‌ప్ప‌కుండా సాయ‌మందిస్తామ‌న్నారు. అంతా బానే ఉంది. గంట త‌రువాత హైద‌రాబాద్‌లో జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశం మ‌హా స‌మ్మేళ‌న్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డింది. టీఆర్ ఎస్ పార్టీ పాల‌న‌లో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దీంతో తెలంగాణ […]

Advertisement
Update: 2016-08-07 22:08 GMT
‘ఎక్క‌డ మాట అక్క‌డే అప్ప‌జెప్ప‌డం’ అంటే ఏంటో బీజేపీ నేత‌ల‌నే చూసి నేర్చుకోవాలి. గ‌జ్వేల్ స‌భ‌లో మోదీ తెలంగాణ‌ను అభివృద్ధి చేస్తాం, మీకు తోడుగా ఉంటాం అని భ‌రోసా ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం త‌ప‌న ప‌డుతున్నారు. త‌ప్ప‌కుండా సాయ‌మందిస్తామ‌న్నారు. అంతా బానే ఉంది. గంట త‌రువాత హైద‌రాబాద్‌లో జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశం మ‌హా స‌మ్మేళ‌న్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డింది. టీఆర్ ఎస్ పార్టీ పాల‌న‌లో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దీంతో తెలంగాణ ప్ర‌జ‌లు కాస్త గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. కేంద్ర నాయ‌కులు రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తామన్నా తెలంగాణ ప్రభుత్వమే సహకరించడంలేదని, నియంతృత్వం తాండవిస్తోంద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.
మ‌న‌దేశంలోనే కాదు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా మోదీ పాల‌న‌పై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం పెరుగుతోంద‌ని.. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లోనూ అధికారంలోకి వ‌స్తామ‌ని రాష్ట్ర బీజేపీ నాయ‌క‌త్వం ఆశాభావం వ్య‌క్తం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ కేసీఆర్ పాల‌న‌పై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న పాల‌న‌లోనే పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారని ఆరోపించారు. రాష్ట్రంలో సీట్లు, ఓట్లు, వెన్నుపోట్లే ల‌క్ష్యంగా పాల‌న సాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న్యాయ‌స్థానాలు పాల‌న‌పై మొట్టికాయ‌లు వేస్తున్నా.. నియంతృత్వ పోక‌డ‌ల‌తో తీరు మార్చుకోవ‌డం లేద‌ని ఘాటుగా విమ‌ర్శించారు. ఎంసెట్ లీకేజీలో ఇంతవ‌ర‌కూ ఒక్క మంత్రి కూడా రాజీనామా చేయ‌లేదంటే అవినీతిని స‌మ‌ర్ధిస్తున్న‌ట్లేన‌ని నిందించారు. ల‌క్ష‌లాది మంది విద్యార్థుల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం చెల‌గాట‌మాడుతోంద‌న్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను గులాబీ నేత‌లు ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌ధాని అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చి గంట‌యినా గ‌డ‌వ‌క ముందే ఇక్క‌డ అంతా అవినీతి, నియంతృత్వం అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డంపై గులాబీనేత‌లు తీవ్ర‌ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. వీరి వ్యాఖ్య‌లను ప్రధాని విశ్వ‌సిస్తే.. ఇక్క‌డి పథ‌కాల‌కు నిధులు అనుకున్న మేర రావ‌డం క‌ష్ట‌మ‌ని ఆందోళ‌న ప‌డుతున్నారు. దేవుడి వ‌ర‌మిచ్చినా.. పూజారి అడ్డుకోవ‌డం అంటే ఇదేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌ను అంత సీరియ‌స్‌గా తీసుకోన‌వ‌స‌రం లేద‌ని గులాబీ అగ్ర‌నేత‌లు కార్య‌క‌ర్త‌ల‌కు సూచిస్తున్న‌ట్లు తెలిపారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News