పాజిటివ్‌ ప్రసంగం సాగించిన కేసీఆర్

కేంద్రంలో టీడీపీ మిత్రపక్షంగా ఉండడంతో ఏపీకి చేసినంత కూడా తెలంగాణకు కేంద్రం సాయం చేయడం లేదన్న భావన వ్యక్తమవుతూ వచ్చింది. అయితే మోదీ గజ్వేల్ వచ్చిన సందర్బంగా జరిగిన సభలో ప్రసంగించిన కేసీఆర్… మోదీ మనసును ఆకట్టుకునే ప్రయత్నంచేశారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో సాయం అందుతోందన్నారు.  మునుముందు కూడా మరింత సహకరించాలని కోరారు. హిందీలో ప్రసంగించిన కేసీఆర్‌… తన పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక స్వాగతం చెబుతున్నానని అన్నారు. […]

Advertisement
Update: 2016-08-07 05:42 GMT

కేంద్రంలో టీడీపీ మిత్రపక్షంగా ఉండడంతో ఏపీకి చేసినంత కూడా తెలంగాణకు కేంద్రం సాయం చేయడం లేదన్న భావన వ్యక్తమవుతూ వచ్చింది. అయితే మోదీ గజ్వేల్ వచ్చిన సందర్బంగా జరిగిన సభలో ప్రసంగించిన కేసీఆర్… మోదీ మనసును ఆకట్టుకునే ప్రయత్నంచేశారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో సాయం అందుతోందన్నారు. మునుముందు కూడా మరింత సహకరించాలని కోరారు.

హిందీలో ప్రసంగించిన కేసీఆర్‌… తన పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక స్వాగతం చెబుతున్నానని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో అవినీతిరహిత పాలన సాగుతోందన్నారు. బూతద్దం వేసి చూసినా చిన్న అవినీతి కూడా కనిపించడం లేదని ఈ ఘనత మోదీకే దక్కుతుందన్నారు. బీజేపీ వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు. 2009లోనే తాను కలిసినప్పుడు తెలంగాణ ఏర్పాటుకు మోదీ మద్దతు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

గతంలో మూతపడిన రామగుండం ఫర్టిలైజర్‌ కార్పోరేషన్‌ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతినిచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ప్రజానీకం ధన్యవాదాలు తెలుపుతోందన్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా మోదీ రాష్ట్రానికి రావడం ఆనందంగా ఉందని కేసీఆర్‌ అన్నారు. సభలో మోదీ తలకు కిరీటం పెట్టి కేసీఆర్‌ సన్మానించారు. జ్ఞాపికను అందజేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News