ఇబ్బందుల్లో రామోజీ...

నిన్న ఈనాడులో వచ్చిన “అందరూ మీలా పనిచేస్తే చాలు” అనే వార్తపై సోషల్‌మీడియాలో చెణుకులు పేలుతున్నాయి. ప్రణబ్‌ముఖర్జీ చంద్రబాబు ఇద్దరు మాత్రమే కలిసి మాట్లాడుకున్న మాటలు ఈనాడుకు ఎలా తెలిశాయి? రాష్ట్రపతి ఆవిషయాలు ఎవరికీ చెప్పడుకదా! ఇక తెలిసింది అంటే ఈనాడుకు చంద్రబాబే చెప్పివుండాలి. ఇలాంటి విషయాలు చంద్రబాబు ఎప్పుడూ ఒక పత్రికకు చెబుతాడు కదా! ఆ ఆనవాయితీ తప్పి ఈసారి ఈనాడుకు నిజంగా చెప్పాడా? లేక రాష్ట్రపతి భవన్‌లో ఈనాడు వాళ్లు రహస్య కెమెరాలేమైనా పెట్టారా? […]

Advertisement
Update: 2016-08-06 04:07 GMT

నిన్న ఈనాడులో వచ్చిన “అందరూ మీలా పనిచేస్తే చాలు” అనే వార్తపై సోషల్‌మీడియాలో చెణుకులు పేలుతున్నాయి. ప్రణబ్‌ముఖర్జీ చంద్రబాబు ఇద్దరు మాత్రమే కలిసి మాట్లాడుకున్న మాటలు ఈనాడుకు ఎలా తెలిశాయి? రాష్ట్రపతి ఆవిషయాలు ఎవరికీ చెప్పడుకదా! ఇక తెలిసింది అంటే ఈనాడుకు చంద్రబాబే చెప్పివుండాలి. ఇలాంటి విషయాలు చంద్రబాబు ఎప్పుడూ ఒక పత్రికకు చెబుతాడు కదా! ఆ ఆనవాయితీ తప్పి ఈసారి ఈనాడుకు నిజంగా చెప్పాడా? లేక రాష్ట్రపతి భవన్‌లో ఈనాడు వాళ్లు రహస్య కెమెరాలేమైనా పెట్టారా? అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

గతంలో సోనియాగాంధీ జగన్‌ను మందలించినట్లు ఒక దిన పత్రికలో వార్తలు వచ్చాయి. నిజంగా అలా జరిగివుంటే ఆ సమాచారం ఆ పత్రికకు ఎవరు చెప్పినట్టు? సోనియా గాంధీ చెప్పరు కదా! తనను మందలించారని జగన్‌ చెప్పరు కదా! మరి ఎవరు చెప్పినట్లు? ఈ పత్రికకే ఎలా తెలిసినట్టు? దేవుడికే తెలియాలి.

చంద్రబాబు చాలామంది ప్రముఖులను కలిసినప్పుడు, వాళ్లిద్దరే మాట్లాడుకున్నప్పుడు కూడా వాళ్లేమి మాట్లాడుకున్నది అక్షరం పొల్లు పోకుండా, ప్రతి డైలాగు వివరంగా సినిమా స్క్రిప్ట్‌లాగా ఒక పత్రికలో మరునాడు దర్శనమిస్తుంది. అది ఆనవాయితి. అలాంటి ఆనవాయితి తప్పి ఇప్పుడు అలాంటి స్క్రిప్ట్‌ ఆ పత్రికలో కాకుండా ఈనాడులో దర్శనమివ్వడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అందుకే అది సోషల్‌మీడియాలో వార్త అయింది. నెటిజన్‌లు రామోజీని, ఈనాడును నిలదీస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరికొందరు విద్యాధికులు మరో అడుగు ముందుకేసి మీరు నిజంగా ఇలా పొగిడారా? అంటూ ఈనాడులో వచ్చిన కథనాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసి రాష్ట్రపతికి ట్వీట్‌ చేస్తున్నారు. ఉత్తరాలు రాస్తున్నారు, ఫేస్ బుక్సులో పెడుతున్నారు. బహుశా రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతికి సెగ తగలవచ్చు. ఆ వార్త తాలూకు ఈనాడు క్లిప్పింగు, దాని అనువాదం, అది నిజమేనా?అని వీళ్ల లేఖలు రాష్ట్రపతికి చేరితే ఆయన రియాక్ట్‌ కాక తప్పదు. రాష్ట్రపతి నిజంగా అలా పొగిడివుంటే ఎవరికీ ఏ ఇబ్బందులూ లేవు. అలా కాకుండా ఆ వార్త ఈనాడు వండి వార్చిన సొంత కవిత్వం అయి ఉండి వుంటే రాష్ట్రపతి నుంచి రామోజీకి, చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవేమో..!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News