గులాబి పధకాలకు కమలం రంగు..

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఆగ‌స్టు 7న తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. మిష‌న్ భ‌గీర‌థ‌, ఎన్టీపీసీ త‌దిత‌ర ప్రతిష్టాత్మ‌క ప‌థ‌కాల‌ను ప్రారంభించ‌నున్నారు. ఇంత‌కాలం అధికార పార్టీతో ఉప్పు-నిప్పులా ఉన్న రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు ఈ ప‌రిణామం మింగుడ ప‌డ‌టం లేదు. అందుకే, తెలంగాణ రాష్ట్ర స‌మితిని విమ‌ర్శించ‌డం రెట్టింపు చేసింది. అయితే, ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ఖాయం అయిన నేప‌థ్యంలో తెలంగాణ బీజేపీ నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఈ ప‌థ‌కాల‌ను మోదీ పొగిడితే.. ఆ క్రెడిట్ కేసీఆర్ కు వెళ్లిపోతుంది. ఇంత‌కాలం తాము […]

Advertisement
Update: 2016-08-04 23:19 GMT

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఆగ‌స్టు 7న తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. మిష‌న్ భ‌గీర‌థ‌, ఎన్టీపీసీ త‌దిత‌ర ప్రతిష్టాత్మ‌క ప‌థ‌కాల‌ను ప్రారంభించ‌నున్నారు. ఇంత‌కాలం అధికార పార్టీతో ఉప్పు-నిప్పులా ఉన్న రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు ఈ ప‌రిణామం మింగుడ ప‌డ‌టం లేదు. అందుకే, తెలంగాణ రాష్ట్ర స‌మితిని విమ‌ర్శించ‌డం రెట్టింపు చేసింది. అయితే, ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ఖాయం అయిన నేప‌థ్యంలో తెలంగాణ బీజేపీ నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఈ ప‌థ‌కాల‌ను మోదీ పొగిడితే.. ఆ క్రెడిట్ కేసీఆర్ కు వెళ్లిపోతుంది. ఇంత‌కాలం తాము చేసిన విమ‌ర్శ‌ల‌న్నీ గంగ‌లో కొట్టుకుపోతాయ‌ని బెంగ పెట్టుకున్నారు. కానీ, ఓ ఆలోచ‌న వారిని ఈ ఆప‌ద నుంచి గ‌ట్టెక్కించేలా ఉంది. అదేంటంటే.. ప్ర‌ధాని ప్రారంభించే ప‌థ‌కాల‌ను హైజాగ్ చేసుకుంటే.. ఎలా ఉంటుంది? అన్న ఆలోచ‌న బీజేపీ రాష్ట్ర నాయ‌కుల‌కు వ‌చ్చింది. ఇంకేముంది? ఆలోచ‌న బాగుండ‌టంతో ఎగిరి గంతేశారు.

ఎలాగు మిష‌న్ భ‌గీర‌థ‌, ఎన్టీపీసీ ప్రాజెక్టుల‌కు కేంద్రం నిధులు త‌ప్ప‌నిస‌రి. ఆ నిధులు లేకపోతే వీటిని పూర్తి చేయ‌డం సాధ్యం కాదు. నిధులు విడుద‌ల చేయ‌డం కేంద్రం బాధ్య‌త‌. ఇక్క‌డే బీజేపీ నాయ‌కులు త‌మ తెలివిని వాడుతున్నారు. ఆ నిధులు విడుద‌ల చేసింది బీజేపీ కాబ‌ట్టి.. ఈ ప‌థ‌కాలు పూర్త‌యితే ఆ ఘ‌న‌త కూడా మాదే. కాబట్టి ప‌థ‌కాల క్రెడిట్ అంతా కేసీఆర్ ఒక్క‌డిదే కాదు.. నిధులు విడుద‌ల చేసిన మా పార్టీది కూడా అవుతుంది అని బ‌లంగా వాద‌న‌లు మొద‌లు పెట్టారు. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ప్రెస్ మీట్ పెట్టాడు. తెలంగాణ‌కు ప్ర‌ధాని ఎన్నో బ‌హుమ‌తులు ప‌ట్టుకువ‌స్తున్నాడ‌ని ప్ర‌క‌టించారు. ఆగ‌స్టు 7న జ‌రిగే స‌భ‌లో ఆయ‌న త‌న వెంట తెచ్చిన ఎన్నో తాయిలాల‌ను తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అందించ‌నున్నాడ‌ని వెల్ల‌డించారు. ఇప్పుడు అర్థ‌మైందా? ఆ తాయిలాలు ఏంటో.. ఇంకేంటి.. నీతి ఆయోగ్ సూచించిన‌ట్లుగా మిష‌న్ భ‌గీర‌థ‌కు కేంద్రం నిధులు ఇస్తుంద‌ని స‌భాముఖంగా ప్ర‌క‌టించ‌డ‌మే! అద్గ‌దీ బీజేపీ నేత‌ల ప్లాన్‌!

Click on Image to Read:

Also Read క‌బాలిని కూడా వ‌ద‌ల్లేదు..!

17 ఏళ్ల త‌ర్వాత గౌత‌మిని చూడ‌బోతున్నాం…!

విడాకులు తీసుకోవడం గ్యారెంటీ…

Tags:    
Advertisement

Similar News