కేంద్రంలో ఆ పార్టీకే మా మద్దతు...

ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు వైఎస్ జగన్. ప్రత్యేక హోదా బంద్‌ను విఫలం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. నెల్లూరు యువభేరిలో మాట్లాడిన వైఎస్ జగన్ భవిష్యత్తులో తాము కేంద్రంలో ఎలాంటి పార్టీకి మద్దతు ఇస్తామన్న విషయాన్నికూడా చెప్పారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఆఖరులో … ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఎవరైతే ఏపీకి ప్రత్యేక హోదా  ఇస్తారో వారి  పార్టీకే కేంద్రంలో  వైసీపీ  మద్దతు తెలుపుతుందన్నారు. […]

Advertisement
Update: 2016-08-04 06:17 GMT

ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు వైఎస్ జగన్. ప్రత్యేక హోదా బంద్‌ను విఫలం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. నెల్లూరు యువభేరిలో మాట్లాడిన వైఎస్ జగన్ భవిష్యత్తులో తాము కేంద్రంలో ఎలాంటి పార్టీకి మద్దతు ఇస్తామన్న విషయాన్నికూడా చెప్పారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఆఖరులో … ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఎవరైతే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారో వారి పార్టీకే కేంద్రంలో వైసీపీ మద్దతు తెలుపుతుందన్నారు. అయితే కేంద్రంలో మద్దతుపై జగన్ మాట వరుసకు చెప్పారా?. లేక సీరియస్ గా ఆలోచించే ఈ మాటలన్నారా అన్నది ఆలోచించాలి. అయితే ఏపీకి ప్రత్యేక హోదా అన్నది చావుబతుకుల సమస్యలా మారిన నేపథ్యంలో నిజంగానే కేంద్రంలో ఏ పార్టీ అయినా ముందుకొచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధపడితే, అది ఎలాంటి పార్టీ అయినా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం మద్దతు ఇవ్వడంలో తప్పు లేదు.

రెండేళ్లు అవుతున్నా చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని జగన్ మండిపడ్డారు. హోదా విషయంలో కేంద్ర పెద్దలు దారుణంగా అబద్ధాలు చెబుతున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. హోదా విషయంలో కుట్రలు చేస్తున్న తీరును చూస్తే పార్లమెంట్ వ్యవస్థ సిగ్గుతో తలదించుకునేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News