నేరుగా రేప్‌ చేసేశారు...

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు చర్చకు రాకుండా అడ్డుకోవడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీపై అత్యాచారయత్నం మాత్రమే జరిగిందని ఈ రోజు మాత్రం ఏకంగా రాష్ట్రాన్ని రేప్‌ చేసేశారని మండిపడ్డారు. ఏపీ అంటే కేంద్రానికి ఎంత చిన్నచూపు ఉందో ఈరోజు తేటతెల్లమైందన్నారు. ఒక ఎంపీ పార్లమెంట్‌లో వీడియో తీయడాన్ని అడ్డుపెట్టుకుని … ఒక రాష్ట్ర సమస్యను పక్కనపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. చేసిన […]

Advertisement
Update: 2016-07-22 09:55 GMT

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు చర్చకు రాకుండా అడ్డుకోవడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీపై అత్యాచారయత్నం మాత్రమే జరిగిందని ఈ రోజు మాత్రం ఏకంగా రాష్ట్రాన్ని రేప్‌ చేసేశారని మండిపడ్డారు. ఏపీ అంటే కేంద్రానికి ఎంత చిన్నచూపు ఉందో ఈరోజు తేటతెల్లమైందన్నారు. ఒక ఎంపీ పార్లమెంట్‌లో వీడియో తీయడాన్ని అడ్డుపెట్టుకుని … ఒక రాష్ట్ర సమస్యను పక్కనపెట్టడం ఏమిటని ప్రశ్నించారు.

చేసిన చట్టాన్ని అమలు చేయాల్సిందిగా కోరుతూ బిల్లు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించడం దురదృష్టకరమన్నారు. ఏపీ పీకనొక్కి కనీసం మంచినీళ్లు కూడా పోయడం లేదని ఆవేదన చెందారు. ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెసే కారణమని టీడీపీ విమర్శించడాన్ని ఉండవల్లి తప్పుపట్టారు. పాపం చేసింది కాబట్టే ఏపీలో కాంగ్రెస్‌ చచ్చిపోయిందన్నారు. రెండు శాతం ఓట్లు కూడా రాకుండా ప్రజలు చంపేశారని అన్నారు. చచ్చిపోయిన కాంగ్రెస్‌ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు టీడీపీ, బీజేపీ ఏం చేస్తున్నాయో చెప్పాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాటం చేయడమా లేకుంటే బీజేపీతోనే కలిసి ఉండడమా అన్న దానిపై టీడీపీ తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు అరుణ్‌కుమార్.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News