కండువా వేసుకుంటేపోలా...

చంద్రబాబు పరిపాలనలో కొందరు ఉన్నతాధికారులు… అధికారుల తరహాలో కాకుండా రాజకీయనాయకుల్లా వ్యవహరిస్తున్నారు. ఫిరాయింపు రాజకీయ సభకు కర్నూలు కలెక్టర్ అప్పట్లో నేరుగా టెంటు పనులను పర్యవేక్షించగా… గోదావరి జిల్లాలో ఒక కలెక్టర్ చంద్రబాబు బంధువు కావడంతో నేతల మీదే స్వారీ చేస్తూ వస్తున్నారు. తాజాగా అనంతపురంజిల్లా కలెక్టర్ కోన శశిధర్ పనితీరుపైనా విమర్శలు వస్తున్నాయి. టీడీపీ బాగుకోసం ఈయన చాలా కష్టపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతలకు మాత్రమే పనులు చేస్తారని విపక్షాల ఆరోపణ. తాజాగా ఒక […]

Advertisement
Update: 2016-07-19 02:26 GMT

చంద్రబాబు పరిపాలనలో కొందరు ఉన్నతాధికారులు… అధికారుల తరహాలో కాకుండా రాజకీయనాయకుల్లా వ్యవహరిస్తున్నారు. ఫిరాయింపు రాజకీయ సభకు కర్నూలు కలెక్టర్ అప్పట్లో నేరుగా టెంటు పనులను పర్యవేక్షించగా… గోదావరి జిల్లాలో ఒక కలెక్టర్ చంద్రబాబు బంధువు కావడంతో నేతల మీదే స్వారీ చేస్తూ వస్తున్నారు.

తాజాగా అనంతపురంజిల్లా కలెక్టర్ కోన శశిధర్ పనితీరుపైనా విమర్శలు వస్తున్నాయి. టీడీపీ బాగుకోసం ఈయన చాలా కష్టపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతలకు మాత్రమే పనులు చేస్తారని విపక్షాల ఆరోపణ. తాజాగా ఒక రాజకీయ పంచాయితీలోకి కలెక్టర్‌ స్వయంగా జోక్యం చేసుకోవడం చూసి జిల్లా నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఆయన చేసిన పంచాయితీ కూడా చిన్నది కాదు. ఏకంగా ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి, అనంతపురం మేయర్ స్వరూప మధ్య రాజీ కుదిర్చే పంచాయితీలో పాలుపంచుకున్నారు.

అనంతపురంలో డ్రైనేజ్ వ్యవస్థను సరిచేయడం పక్కనపెట్టి… కేవలం డివైడర్లు నిర్మించడం, నగర అందాల కోసం రంగులు వేయడంతో స్వరూప సరిపెడుతున్నారని జేసీ ప్రధాన అభ్యంతరం. చేయాల్సిన పనులు చేయకుండా ఇలా కేవలం ఆర్భాటాల కోసం కోట్లు ఖర్చుపెడితే సహించేది లేదని జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగానే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జేసీ, స్వరూప మధ్య రాజీ కుదిర్చేందుకు పల్లె రఘునాథరెడ్డి రంగంలోకి దిగారు. ఆయన రాజకీయ నాయకుడే కాబట్టి ఆ పని చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ జేసీ, స్వరూప మధ్య రాజీ పంచాయితీలో కలెక్టర్ కూడా స్వయంగా పాల్గొనడంపై విమర్శలు వస్తున్నాయి.

జిల్లా మున్సిపల్ గెస్ట్ హౌజ్ లో జరిగిన పంచాయితీకి పల్లె, జేసీతో పాటు కలెక్టర్ కూడా స్వయంగా హాజరయ్యారు. పల్లెతో పాటు కలెక్టర్‌ కూడా పంచాయితీలో కీలక సూచనలు చేశారట. కలెక్టర్ అతిచొరవపై వైసీపీ, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఒక ఐఏఎస్ అయి ఉండి రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి… కలెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌గా ఉండి రాజకీయ పంచాయితీలు చేయడం కంటే నేరుగా టీడీపీ కండువా కప్పుకోండి అని సలహా ఇచ్చారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న జేసీ దివాకర్‌ రెడ్డి చివరకు మేయర్ స్వరూపలాంటి వారితో రాజీ పంచాయితీలు పెట్టుకోవడం ఏంటో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News