హమ్మయ్య.... సూపర్ స్టార్ కనిపించాడు...

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఏమైంది…? ఇన్ని రోజులైనా రజనీకాంత్ కనిపించడేంటి…? మరీ ముఖ్యంగా కబాలి విడుదల దగ్గరపడుతున్నప్పటికీ రజనీకాంత్ జాడ లేదేంటి…? ఇలా అభిమానుల్లో ఎన్నో సందేహాలు. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదు. డాక్టర్లు ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం రజనీకాంత్ కదల్లేని స్థితిలో ఉన్నారు. ఇలా మరెన్నో పుకార్లు. ఈ అనుమాానాలు, పుకార్లకు చెక్ పడింది. ఎట్టకేలకు రజనీకాంత్ కంటికి కనిపించాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటో అదే. సరిగ్గా 24 […]

Advertisement
Update: 2016-07-18 10:26 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఏమైంది…? ఇన్ని రోజులైనా రజనీకాంత్ కనిపించడేంటి…? మరీ ముఖ్యంగా కబాలి విడుదల దగ్గరపడుతున్నప్పటికీ రజనీకాంత్ జాడ లేదేంటి…? ఇలా అభిమానుల్లో ఎన్నో సందేహాలు. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదు. డాక్టర్లు ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం రజనీకాంత్ కదల్లేని స్థితిలో ఉన్నారు. ఇలా మరెన్నో పుకార్లు. ఈ అనుమాానాలు, పుకార్లకు చెక్ పడింది. ఎట్టకేలకు రజనీకాంత్ కంటికి కనిపించాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటో అదే. సరిగ్గా 24 గంటల కిందట తీసిన ఫొటో ఇది. పూర్తి ఆరోగ్యంతో రజనీకాంత్ అమెరికాలో దిగిన ఫొటో ఇది. రజనీ కుమార్తె ఐశ్వర్యరాయ్ ఈ ఫొటోను పోస్ట్ చేశారు.
అమెరికాలో ఉన్న రజనీకాంత్… విర్జీనియాలోని సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించారు. దీని పేరు లోటస్ ఆఫ్ ఆల్ ఫెయిత్ టెంపుల్. ఇక్కడ రజనీకాంత్ తన గురువుకు ప్రత్యేకంగా పూజలు చేశారు. అక్కడ తీసిన ఫొటోనే ఐశ్వర్య పోస్ట్ చేశారు. రజనీ పక్కన ఆమె కూడా ఉన్నారు. తాజా ఫొటోతో తలైవ ఫ్యాన్స్ కు ఏనుగంత బలం వచ్చేసింది. కొండంత అండ దొరికినట్టయింది. పైగా… రేపో, ఎల్లుడో రజనీకాంత్ చెన్నైకు వచ్చేస్తున్నారనే వార్త కూడా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. రజనీ కనుక ల్యాండ్ అయితే కబాలి ఫీవర్ మరింత ఊపందుకుంటోంది. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా… శుక్రవారం నాడు కబాలి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
Advertisement

Similar News