బీజేపీ దెబ్బకు దడుచుకున్న కేజ్రీవాల్‌..?

కేజ్రీవాల్‌ సతీమణి సునీత ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌ మెంట్‌లో ఉన్నతోద్యోగంనుంచి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. దాదాపు 22 ఏళ్ల పాటు ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం చేసిన సునీత కొన్ని నెలల క్రితం వాలంటరీ రిటైర్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆమెను కేంద్రప్రభుత్వం రిలీవ్‌ చేసింది. ఈ వార్త బయటకు రాగానే కేజ్రీవాల్‌ వ్యతిరేక మీడియా ఆమె ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరుతారని, ఢిల్లీ, పంజాబ్‌, గోవా రాష్ట్రాలలో “ఆప్‌” అధికారంలోకి వస్తే ఏదో ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి […]

Advertisement
Update: 2016-07-14 01:47 GMT

కేజ్రీవాల్‌ సతీమణి సునీత ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌ మెంట్‌లో ఉన్నతోద్యోగంనుంచి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. దాదాపు 22 ఏళ్ల పాటు ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం చేసిన సునీత కొన్ని నెలల క్రితం వాలంటరీ రిటైర్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆమెను కేంద్రప్రభుత్వం రిలీవ్‌ చేసింది.

ఈ వార్త బయటకు రాగానే కేజ్రీవాల్‌ వ్యతిరేక మీడియా ఆమె ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరుతారని, ఢిల్లీ, పంజాబ్‌, గోవా రాష్ట్రాలలో “ఆప్‌” అధికారంలోకి వస్తే ఏదో ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిలబడతారని ప్రచారం మొదలుపెట్టింది.

“ఆప్‌”పార్టీ నియమనిబంధనల ప్రకారం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అసలు పోటీనే చేయకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా అవుతారు? ఇదంతా కేజ్రీవాల్‌ కుటుంబం మీద బురదజల్లే కార్యక్రమం కాక మరేమిటి? అని “ఆప్‌”నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఆమె పదవికోసం రాజీనామ చేయలేదు. కేంద్రంలో వున్న బీజేపీ పార్టీ ఆమ్‌ ఆద్మీ ఎమ్మెల్యేలను, నాయకులను వెంటాడి, వేటాడి చిన్న చిన్న కేసుల్లో ఇరికించి జైలుకు పంపుతోంది. ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్‌ను ఏమీచేయలేక ఆయన భార్యను ఉద్యోగపరంగా ఏదైనా కేసుల్లో ఇరికించే అవకాశముందని కేజ్రీవాల్‌, ఆయన భార్య భావించడంవల్లే ముందు జాగ్రత్తగా ఆమె వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నదని “ఆప్‌” నాయకుడు ఒకాయన వెల్లడించాడు.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News