విషాదాంతమైన ధోని లవ్‌ స్టోరి...

టీంఇండియా కెప్టెన్ ధోని బయోపిక్‌ను డైరెక్టర్ పాండే నీరజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తకిరమైన అంశం ఒకటి బయటకు వచ్చింది. ఈచిత్రంలో ధోని లవ్‌ స్టోరి కూడా ఉండబోతోంది. అయితే అది విషాదాంతమైన ప్రేమ కథ. ధోని 20 ఏళ్ల వయసులో అండర్‌ 11 ఆడుతున్న సమయంలో ప్రియాంక ఝా అనే యువతితో ప్రేమలో పడ్డారు. తనతోనే జీవితం గడపాలనుకున్నారు. కానీ ప్రియాంక ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారు. దీంతో ఏడాది పాటు ధోని కుమిలిపోయారు. ఆ […]

Advertisement
Update: 2016-07-12 02:37 GMT

టీంఇండియా కెప్టెన్ ధోని బయోపిక్‌ను డైరెక్టర్ పాండే నీరజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తకిరమైన అంశం ఒకటి బయటకు వచ్చింది. ఈచిత్రంలో ధోని లవ్‌ స్టోరి కూడా ఉండబోతోంది. అయితే అది విషాదాంతమైన ప్రేమ కథ. ధోని 20 ఏళ్ల వయసులో అండర్‌ 11 ఆడుతున్న సమయంలో ప్రియాంక ఝా అనే యువతితో ప్రేమలో పడ్డారు. తనతోనే జీవితం గడపాలనుకున్నారు. కానీ ప్రియాంక ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారు. దీంతో ఏడాది పాటు ధోని కుమిలిపోయారు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఏడాది పట్టిందట.

అనంతరం తల్లిదండ్రుల ప్రేరణతో తిరిగి బ్యాట్‌ ఝులిపించాడు ధోని. అయితే ఈ విషయం ఇంతకాలం ధోని సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నీరజ్‌ తన చిత్రం ద్వారా ప్రేక్షకులకు ధోని జీవితంలోని అనేక సంఘటనలను వివరించబోతున్నాడు. తన లవ్‌ స్టోరీని చిత్రంలో చూపించేందుకు ధోని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ధోనీ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో హీరోయిన్ దిషాపటాని కనిపిస్తారని చెబుతున్నారు.

click on image to read-

Tags:    
Advertisement

Similar News