పాపం పల్లె రెడ్డి... అటు సీఎం, ఇటు సునీత, మధ్య కొల్లు

మంచివాడు, సౌమ్యుడు అన్న పేరు మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఉంది. తన పని తాను చేసుకుంటూపోతుంటారు. పక్క శాఖల్లో వేలు పెట్టడం, లేనిపోని వివాదాల జోలికి వెళ్లడం వంటివి చేయరు. అయితే ఇప్పుడు ఆయనకు ఆ మంచితనమే ఇబ్బందిగా మారుతోంది. సహచర మంత్రులకు కూడా ఆయనంటే గౌరవం లేకుండా పోతోంది. చివరకు నిజాయితీగా ఉన్నందుకు సీఎం కూడా పల్లెను దండించడం ఆశ్చర్యంగానే ఉంది. ప్రస్తుతం పల్లె రఘునాథరెడ్డి ఐటీ, సమాచారశాఖతో పాటు మైనార్టీ శాఖకు కూడా మంత్రిగా […]

Advertisement
Update: 2016-07-11 08:53 GMT

మంచివాడు, సౌమ్యుడు అన్న పేరు మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఉంది. తన పని తాను చేసుకుంటూపోతుంటారు. పక్క శాఖల్లో వేలు పెట్టడం, లేనిపోని వివాదాల జోలికి వెళ్లడం వంటివి చేయరు. అయితే ఇప్పుడు ఆయనకు ఆ మంచితనమే ఇబ్బందిగా మారుతోంది. సహచర మంత్రులకు కూడా ఆయనంటే గౌరవం లేకుండా పోతోంది. చివరకు నిజాయితీగా ఉన్నందుకు సీఎం కూడా పల్లెను దండించడం ఆశ్చర్యంగానే ఉంది.

ప్రస్తుతం పల్లె రఘునాథరెడ్డి ఐటీ, సమాచారశాఖతో పాటు మైనార్టీ శాఖకు కూడా మంత్రిగా ఉన్నారు. ఇటీవల రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ముస్లింలకు రంజాన్‌ తోఫా పేరుతో పండుగ వస్తువులను ఇచ్చింది. సాధారణంగా అయితే మైనార్జీ శాఖ మంత్రి కాబట్టి పల్లె రఘునాథరెడ్డి ఫొటో కూడా బ్యాగులపై ముద్రించాలి. కానీ అలా జరగలేదు. కేవలం పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఫొటో మాత్రమే ముద్రించుకున్నారు. దీనిపై గతేడాదే ముఖ్యమంత్రికి పల్లె ఫిర్యాదు చేశారు. కానీ చంద్రబాబు పరిటాల వారికి ఇచ్చినంత ప్రాధాన్యత పల్లెకు ఇవ్వరు కదా!. కాబట్టి గతేడాది పల్లె ఫొటో లేకుండానే తోఫా ఇచ్చేశారు. ఈ ఏడాది కూడా పరిటాల సునీత అదే పనిచేశారు. పల్లె ఫొటో లేకుండానే తోఫా పంచేశారు. అయితే దీనిపై ఎవరికి చెప్పుకున్నాప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతో జరిగిన అవమానాన్ని పల్లె రఘునాథరెడ్డి దిగమింగుకుని కాలం వెళ్లదీస్తున్నారని చెబుతున్నారు. పరిటాల సునీత జిల్లాలో తన హవా మాత్రమే సాగాలన్న ఉద్దేశంతోనే పల్లెను ఇలా అవమానించారని చెబుతున్నారు. బ్యాగులపై రఘునాథరెడ్డి ఫొటో లేకుండా చేయడం వెనుక ఆమె హస్తమే ఉందన్నది బహిరంగ రహస్యమేనంటున్నారు.

రంజాన్‌ తోఫా అవమానాన్ని దిగమింగుకుని పల్లె రఘునాథరెడ్డి ముందుకుసాగుతుండగానే మచిలీపట్నం పోర్టు వ్యవహారంలో మరోసారి ఆయనను ఇరికించారు. మూడురోజులక్రితం జరిగిన ఏపీ కేబినెట్‌లో పోర్టు కోసం లక్షా 5 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. భూములు లాక్కోవడం అంటే తెగ ఇష్టపడుతున్న ఏపీ మంత్రి వర్గం కూడా అందుకు ఓకే చెప్పింది. సమాచార మంత్రి హోదాలో కేబినెట్‌ వివరాలను మీడియాకు వివరించిన పల్లె… పోర్టు కోసం లక్షా 5ఎకరాల సేకరణ అంశాన్ని కూడా వివరించారు. అయితే దీనిపై పెద్దెత్తున వ్యతిరేకత రావడంతో చంద్రబాబు తెలివిగా మొత్తం వ్యవహారాన్ని పల్లె రఘునాథరెడ్డిపైకి తోసేశారు. మంత్రి కొల్లు రవీంద్ర అయితే మరో అడుగు ముందుకేసి వయసులో పెద్దవాడన్న ఇది కూడా లేకుండా సమాచార శాఖ మంత్రికి సమాచారం లేదంటూ అవమానించారు. తాజాగా చంద్రబాబు కూడా ఈ విషయంలో పల్లె రఘునాథరెడ్డిని సీరియస్‌గా మందిలించారని ఒక ఆంగ్ల దిన పత్రిక కథనాన్ని ప్రచురించింది. అది పల్లె రఘునాథరెడ్డి పరిస్థితి. బాధితుడే శిక్ష అనుభవిస్తున్నట్టుగా ఉంది. స్థానబలం లేనిపార్టీలో ఆధిపత్యాన్ని భరించాల్సిందే మరి.

click on image to read-

Tags:    
Advertisement

Similar News