టీడీపీని గెంటేసి.. పండ‌గ చేసుకున్న టీఆర్ ఎస్‌!

అధికార పార్టీ కాక‌తాళీయంగా చేసిందో.. కావాల‌ని చేసిందో.. గానీ మొత్తానికి టీడీపీని అసెంబ్లీ నుంచి ఖాళీ చేయించింది. టీఆర్ ఎస్‌లో చేరిన‌ టీటీడీపీ నేత‌లంతా కలిసి త‌మ పార్టీ అసెంబ్లీ శాఖ‌ను అధికార పార్టీలో విలీనం చేస్తున్నామంటూ స్పీక‌ర్‌కి లేఖ ఇవ్వ‌డంతో ఆ పార్టీ విలీనం పూర్త‌యింది. ఫ‌లితంగా అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయంలో టీడీపీకి కేటాయించిన రెండుగ‌దుల కార్యాల‌యం ఖాళీ చేయాల్సిన ప‌రిస్థితి. దీనిపై టీడీపీ నేత‌లు అభ్యంత‌రాలు తెలిపినా.. స్పీక‌ర్ వాటిని ప‌ట్టించుకోలేదు. అధికారికంగా ఆ […]

Advertisement
Update: 2016-07-06 21:09 GMT
అధికార పార్టీ కాక‌తాళీయంగా చేసిందో.. కావాల‌ని చేసిందో.. గానీ మొత్తానికి టీడీపీని అసెంబ్లీ నుంచి ఖాళీ చేయించింది. టీఆర్ ఎస్‌లో చేరిన‌ టీటీడీపీ నేత‌లంతా కలిసి త‌మ పార్టీ అసెంబ్లీ శాఖ‌ను అధికార పార్టీలో విలీనం చేస్తున్నామంటూ స్పీక‌ర్‌కి లేఖ ఇవ్వ‌డంతో ఆ పార్టీ విలీనం పూర్త‌యింది. ఫ‌లితంగా అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయంలో టీడీపీకి కేటాయించిన రెండుగ‌దుల కార్యాల‌యం ఖాళీ చేయాల్సిన ప‌రిస్థితి. దీనిపై టీడీపీ నేత‌లు అభ్యంత‌రాలు తెలిపినా.. స్పీక‌ర్ వాటిని ప‌ట్టించుకోలేదు. అధికారికంగా ఆ పార్టీ నేత‌ల విలీనం పూర్తయినందున‌.. ఇక ఆ పార్టీకి అసెంబ్లీ ప్రాంగ‌ణంలో కార్యాల‌యం అన‌వ‌స‌రం అని స్పీక‌ర్ కార్యాల‌యం భావించిన‌ట్లుంది. అందుకే, టీడీపీ ఆఫీసును ఖాళీ చేయించారు.
టీటీడీపీ కార్యాల‌యాన్ని అసెంబ్లీ క‌మిటీకి బ‌ద‌లాయించారు. ఇంత‌వ‌ర‌కూ రెండుగ‌దుల టీడీపీ కార్యాలయంలో ఒక దాంట్లో మీడియా స‌మావేశాల‌కు, మ‌రోదాంట్లో పార్టీ స‌మావేశాలు నిర్వ‌హించుకునేవారు. ఆ రెండుగ‌దుల్లో మీడియా స‌మావేశాల‌కు వినియోగించే గ‌దిని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు బుధ‌వారం స్వాధీనం చేసుకున్నారు. మ‌రో గ‌దికి తాళం వేసి ఉండ‌టంతో స్వాధీనం సాధ్య‌ప‌డ‌లేదు. మొద‌టి గ‌దిలోకి ప్ర‌వేశించిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే, మైనారిటీ క‌మిటీ చైర్మ‌న్‌ ష‌కీల్ ఆ గ‌దిని లాంఛ‌నంగా ప్రారంభించారు. అనంతరం స్వీట్లు పంచారు. ఇంత జ‌రుగుతుంటే.. రేవంత్ రెడ్డి ఏమీ చేయ‌లేక‌.. అధికార పార్టీ చ‌ర్య‌పై నిర‌స‌న మాత్రం తెలిపారు.
దీనిపై టీడీపీ సీనియ‌ర్ నేత రావుల చంద్ర‌శేఖ‌ర్ మాత్రం తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం ఇదంతా కావాల‌ని చేస్తోంద‌ని ఆరోపించారు. అసెంబ్లీ క‌మిటీకి కేటాయించడానికి వేరే గ‌దులే లేవా? అని ప్ర‌శ్నించారు. తెలుగుదేశంపై తెలంగాణ‌ ప్ర‌భుత్వం క‌క్ష సాధింపుచ‌ర్య‌లకు పాల్ప‌డుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. అందులో భాగంగానే.. త‌మ‌ పార్టీ కార్యాల‌యం గ‌దులను అసెంబ్లీ క‌మిటీకి కేటాయించార‌ని ఆరోపించారు. మొత్తానికి టీడీపీ నేత‌లు గొంతులు చించుకున్నా.. వారి అరుపులు అర‌ణ్య‌రోద‌న‌లే అయ్యాయి. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం వారి ప‌ని వారు చేసుకుపోయారు.. స్వీట్లు పంచుకుని పండ‌గ చేసుకున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News