అచ్చం ఓటుకు నోటు తరహాలోనే... కొత్త ఎత్తు రెడీ

పెట్టుబడుల ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తయారు చేసుకున్న అప్లికేషన్‌ను ఏపీ ప్రభుత్వం కాపీ చేసిందన్న వివాదం రెండు రాష్ట్రాల మధ్య ముదురుతోంది. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, ఆడియో టేపుల్లో చంద్రబాబు చిక్కిన వేళ టీడీపీ ఫోన్ ట్యాపింగ్‌ పేరుతో ఎదురుదాడి చేసింది. ఎమ్మెల్యేలను కొనేందుకు లంచం ఇచ్చింది నిజమా కాదా అని ప్రశ్నిస్తే అసలు మా ఫోన్లు ట్యాప్ చేసే అధికారం కేసీఆర్ ప్రభుత్వానికి ఎక్కడిదని చంద్రబాబు వాదించారు. తెలంగాణ పోలీసులపై కేసులు […]

Advertisement
Update: 2016-07-06 22:01 GMT

పెట్టుబడుల ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తయారు చేసుకున్న అప్లికేషన్‌ను ఏపీ ప్రభుత్వం కాపీ చేసిందన్న వివాదం రెండు రాష్ట్రాల మధ్య ముదురుతోంది. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, ఆడియో టేపుల్లో చంద్రబాబు చిక్కిన వేళ టీడీపీ ఫోన్ ట్యాపింగ్‌ పేరుతో ఎదురుదాడి చేసింది. ఎమ్మెల్యేలను కొనేందుకు లంచం ఇచ్చింది నిజమా కాదా అని ప్రశ్నిస్తే అసలు మా ఫోన్లు ట్యాప్ చేసే అధికారం కేసీఆర్ ప్రభుత్వానికి ఎక్కడిదని చంద్రబాబు వాదించారు. తెలంగాణ పోలీసులపై కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు అప్లికేషన్ కాపీ వ్యవహారంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఆ తరహా ఎదురుదాడికి రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన చంద్రబాబు రెండో పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

అప్లికేషన్లు కాపీ కొట్టింది నిజామా అబద్దమా అన్న దాని జోలికి వెళ్లకుండా…అసలు ఏపీ వెబ్‌సైట్‌లో ఉంచిన అప్లికేషన్‌ బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం లేదని అలాంటప్పుడు ఈ విషయం తెలంగాణ ప్రభుత్వానికి ఎలా తెలిసిందని ఏపీప్రభుత్వం ప్రశ్నిస్తోంది. దీనిపై లోతుగా పరిశీలన చేయగా… ఏపీ వెబ్‌సైట్‌ను తెలంగాణ ప్రభుత్వ అధికారులు హ్యాక్‌ చేసినట్టు తెలిసిందట. జులై2న తెలంగాణ సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అధికారి ఏపీ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయినట్టు గుర్తించారట. ఆయన ద్వారానే ఏపీవెబ్‌సైట్‌లో ఉన్న కాపీ అప్లికేషన్ వ్యవహారం బయటకు వెళ్లిందన్న అనుమానం వ్యక్తమవుతోందని పత్రిక కథనం.

దీనిపై సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలా లేక ఐటీ రంగ నిపుణులతో పరిశీలన చేయించాలా అన్న దానిపై గురువారం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందట. దీన్ని చాలా సీరియస్ మ్యాటర్‌గా ఏపీ ప్రభుత్వం తీసుకుందని సదరు పత్రిక చెబుతోంది. విచారణ మాత్రం తప్పనిసరిగా ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతోందని వెల్లడించింది. తాము వెబ్‌సైట్లో ఏమి అప్‌లోడ్ చేశామో బయటకు ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండదని ఏపీ ప్రభుత్వం చెప్పడం బట్టి బహుశా అప్లికేషన్‌ను కాపీ కొట్టినా ఎవరూ కనిపెట్టలేరని భావించిందేమో!. అందుకే తెలంగాణ అప్లికేషన్‌లోని నెంబర్లు, అక్షర దోషాలను కూడా ఉన్నవి ఉన్నట్టు చంద్రబాబు ప్రభుత్వం వెబ్‌సైట్లో పెట్టేసుకుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News