స్వాతిని తను చంపలేదట!
ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి హత్యకేసులో పోలీసులు అరెస్టు చేసిన రామ్‌కుమార్ ప్లేటు ఫిరాయించాడు. తానే హత్యచేసినట్టుగా మొదట పోలీసుల వద్ద అంగీకరించిన రామ్‌కుమార్, ఇప్పుడు ఆ హత్య తాను చేయలేదంటున్నాడు. పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చినపుడు తను ఆత్మహత్యా ప్రయత్నం చేశాననటం కూడా నిజం కాదంటున్నాడు. అసలు నేరస్తులను కాపాడేందుకే పోలీసులు తనపై తప్పుడు కేసు బనాయించారని, తాను అమాయకుడినని అతను తన బెయిల్ పిటీషన్లో పేర్కొన్నాడు. చెన్నై సెషన్స్ కోర్టులో రామ్ కుమార్ మంగళవారం బెయిల్ […]
ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి హత్యకేసులో పోలీసులు అరెస్టు చేసిన రామ్‌కుమార్ ప్లేటు ఫిరాయించాడు. తానే హత్యచేసినట్టుగా మొదట పోలీసుల వద్ద అంగీకరించిన రామ్‌కుమార్, ఇప్పుడు ఆ హత్య తాను చేయలేదంటున్నాడు. పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చినపుడు తను ఆత్మహత్యా ప్రయత్నం చేశాననటం కూడా నిజం కాదంటున్నాడు. అసలు నేరస్తులను కాపాడేందుకే పోలీసులు తనపై తప్పుడు కేసు బనాయించారని, తాను అమాయకుడినని అతను తన బెయిల్ పిటీషన్లో పేర్కొన్నాడు. చెన్నై సెషన్స్ కోర్టులో రామ్ కుమార్ మంగళవారం బెయిల్ పిటీషన్ దాఖలు చేశాడు. గతనెల 24న స్వాతి చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో హత్యకు గురికాగా, సిసిటివి ఫుటేజి ఆధారంగా పోలీసులు రామ్ కుమార్‌ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.