పావులా కోడికి ముప్పావలా మసాలా...

స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకు అప్పగించడాన్ని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి శైలజనాథ్ తప్పుపట్టారు. పావలాకోడికి ముప్పావలా మసాలా నూరినట్టుగా చంద్రబాబు వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ సంస్థను తొలగిస్తే అపరాధ రుసుం కింద 20 శాతం చెల్లించాలనే నిబంధనను సవరించాలనే ఆర్థిక శాఖ అభ్యంతరానికి చంద్రబాబు ఎందుకు మిన్నకుండి పోయారని ప్రశ్నించారు. రాజధానిని సింగపూర్ కంపెనీలు నిర్మిస్తాయని చెబుతూనే మౌలికసదుపాయాల కల్పనకు పలువురితో చంద్రబాబు ఒప్పందాలు […]

Advertisement
Update: 2016-07-05 09:59 GMT

స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకు అప్పగించడాన్ని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి శైలజనాథ్ తప్పుపట్టారు. పావలాకోడికి ముప్పావలా మసాలా నూరినట్టుగా చంద్రబాబు వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ సంస్థను తొలగిస్తే అపరాధ రుసుం కింద 20 శాతం చెల్లించాలనే నిబంధనను సవరించాలనే ఆర్థిక శాఖ అభ్యంతరానికి చంద్రబాబు ఎందుకు మిన్నకుండి పోయారని ప్రశ్నించారు.

రాజధానిని సింగపూర్ కంపెనీలు నిర్మిస్తాయని చెబుతూనే మౌలికసదుపాయాల కల్పనకు పలువురితో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటున్నారని శైలజానాథ్ ఆరోపించారు. సీఆర్‌డీఏ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబు తనకు కావాల్సిన ఫైళ్ల మీద మాత్రమే సంతకాలు చేయించుకుంటున్నారని విమర్శించారు. రైతులు, దళితులను పోలీసుల సాయంతో బెదిరించి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని శైలజనాథ్ అన్నారు. సింగపూర్‌ కంపెనీలు 300 కోట్లు పెట్టుబడి పెడుతుంటే దానికి చంద్రబాబు వెయ్యి కోట్ల రూపాయలతో ప్రచారం చేశారని విమర్శించారు. చంద్రబాబు తీరు పావులా కోడికి ముప్పావులా మసాలా నూరినట్టుగా ఉందన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News