బాబు మాటల్లోనే బయటపడ్డ అసలు విషయం...

రాజధాని నిర్మాణానికి కేంద్రమే సాయం చేస్తుందని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. మోదీ ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తామని చెబుతూనే వచ్చింది. అయితే కేంద్రం నుంచి నిధులు తీసుకోవడం చంద్రబాబుకే ఇష్టం లేదని తేలిపోయింది. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. రాజధాని నిర్మాణానికి కేంద్ర సాయం ఉండదని చెప్పారు. కేవలం 2,500 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చేందుకు అంగీకరించిందని చెప్పారు. ఇప్పటికే ఇచ్చిన నిధులుపోను మరో వెయ్యికోట్లు మాత్రమే వస్తాయని సెలవిచ్చారు. అదే సమయంలో సొంతంగానే […]

Advertisement
Update: 2016-07-02 00:21 GMT

రాజధాని నిర్మాణానికి కేంద్రమే సాయం చేస్తుందని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. మోదీ ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తామని చెబుతూనే వచ్చింది. అయితే కేంద్రం నుంచి నిధులు తీసుకోవడం చంద్రబాబుకే ఇష్టం లేదని తేలిపోయింది. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. రాజధాని నిర్మాణానికి కేంద్ర సాయం ఉండదని చెప్పారు. కేవలం 2,500 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చేందుకు అంగీకరించిందని చెప్పారు. ఇప్పటికే ఇచ్చిన నిధులుపోను మరో వెయ్యికోట్లు మాత్రమే వస్తాయని సెలవిచ్చారు. అదే సమయంలో సొంతంగానే రాజధానిని నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇక్కడే అసలు కిటుకు ఉందని చెబుతున్నారు.

కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఓ పదివేల కోట్ల వరకు రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ రాజధాని నిర్మాణం కేంద్రం నిధులతో చేస్తే తనకు అనుకూలమైన సింగపూర్‌ కంపెనీలకు స్విస్ చాలెంజ్‌లో భూములను, నిధులను తరలించే అవకాశం ఉండదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది. అందుకే మొదటినుంచి కూడా రాజధాని నిర్మాణ నిధులకోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేకుండా తెలివిగా వ్యవహరించారని భావిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి తాము ఇచ్చేది 2,500 కోట్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు. కానీ చంద్రబాబే కుట్ర పూరితంగా కేంద్రం నిధులు ఇవ్వదు కాబట్టి సొంతంగా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని నమ్మించేందుకు ఈ ఎత్తు వేశారని అనుమానిస్తున్నారు. సింగపూర్ కంపెనీలకు భూములు కట్టబెట్టి స్వప్రయోజనాలు కాపాడుకునేందుకు చంద్రబాబు ఇదంతా ఒక కుట్రపూరితంగా చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News