విమాన చార్జీ రెండున్న‌ర వేలే

కేంద్ర ప్ర‌భుత్వం రూపొందించిన కొత్త విధానం ప్ర‌కారం చిన్న న‌గ‌రాల‌కు రూ.2,500 మాత్ర‌మే చార్జీ వ‌సూలు చేస్తారు. ఈ విధానాన్ని ఆగ‌స్టు 1 నుంచి అమ‌లులోకి తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి అశోక గ‌జ‌ప‌తి రాజు ఢిల్లీలో తెలిపారు. దేశంలోని చిన్న న‌గ‌రాల ప్ర‌జ‌ల‌కు విమాన‌యానాన్ని అందుబాటులోకి తీసుకు వ‌చ్చేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నామ‌ని ఈ మేర‌కు ముసాయిదాను తయారు చేశామ‌ని ఆయ‌న చెప్పారు. ఆ ముసాయిదా కాపీని విడుద‌ల చేశారు. దీనిపై […]

Advertisement
Update: 2016-07-01 21:00 GMT

కేంద్ర ప్ర‌భుత్వం రూపొందించిన కొత్త విధానం ప్ర‌కారం చిన్న న‌గ‌రాల‌కు రూ.2,500 మాత్ర‌మే చార్జీ వ‌సూలు చేస్తారు. ఈ విధానాన్ని ఆగ‌స్టు 1 నుంచి అమ‌లులోకి తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి అశోక గ‌జ‌ప‌తి రాజు ఢిల్లీలో తెలిపారు. దేశంలోని చిన్న న‌గ‌రాల ప్ర‌జ‌ల‌కు విమాన‌యానాన్ని అందుబాటులోకి తీసుకు వ‌చ్చేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నామ‌ని ఈ మేర‌కు ముసాయిదాను తయారు చేశామ‌ని ఆయ‌న చెప్పారు. ఆ ముసాయిదా కాపీని విడుద‌ల చేశారు. దీనిపై 3 వారాల పాటు స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తారు. ఆగ‌స్టు 1 నుంచి ఈ విధానాన్ని అమ‌లులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. దేశంలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తి నుంచి అంత‌ర్జాతీయ విమానాలు న‌డిపేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని మంత్రి తెలిపారు.

Advertisement

Similar News