కర్నూలు కోటపై ఎగిరే జెండా ఏది? ట్రాక్ రికార్డ్ ఏం చెబుతోంది..

కర్నూలు కార్పొరేషన్‌ ఎన్నికల నగారా త్వరలోనే మోగనుంది. నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మున్సిపల్  శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలు వ్యూహరచన మొదలుపెట్టాయి. గత ఫలితాలను బేరీజువేసుకుని ప్రణాళికలు రచించుకుంటున్నాయి. 2010 సెప్టెంబర్ నుంచే కర్నూలు కార్పొరేషన్ ప్రత్యేకాధికారుల పాలనలో ఉంది. పదేపదే వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలు ఇప్పుడు టీడీపీ, వైసీపీకి సవాల్‌గా మారాయి. చంద్రబాబు సీఎం అయ్యాక జరిగే కీలక ఎన్నికలు ఇవే కావడంతో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. […]

Advertisement
Update: 2016-07-01 02:05 GMT

కర్నూలు కార్పొరేషన్‌ ఎన్నికల నగారా త్వరలోనే మోగనుంది. నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మున్సిపల్ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలు వ్యూహరచన మొదలుపెట్టాయి. గత ఫలితాలను బేరీజువేసుకుని ప్రణాళికలు రచించుకుంటున్నాయి. 2010 సెప్టెంబర్ నుంచే కర్నూలు కార్పొరేషన్ ప్రత్యేకాధికారుల పాలనలో ఉంది. పదేపదే వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలు ఇప్పుడు టీడీపీ, వైసీపీకి సవాల్‌గా మారాయి. చంద్రబాబు సీఎం అయ్యాక జరిగే కీలక ఎన్నికలు ఇవే కావడంతో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

3.2లక్షల ఓటర్లు ఉన్న కార్పొరేషన్లో మొత్తం 51 వార్డులున్నాయి. ట్రాక్ రికార్డు చూస్తే టీడీపీకి ఏమంతా అనుకులంగా కర్నూలు లేదు. గడిచిన రెండు ఎన్నికల్లోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఫిరోజ్‌ బేగం మేయర్‌గా పనిచేశారు. 2005లో వైఎస్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు వార్డులను మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ తర్వాత కూడా ఇతర ఎన్నికల్లోనూ కర్నూలు టీడీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అయితే ఇప్పుడు చేతిలో అధికారం ఉండడంతో గెలిచితీరాలని బాబు భావిస్తున్నారు. టీజీ వెంకటేష్, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, భూమానాగిరెడ్డి, జిల్లా మంత్రి కేఈ ప్రభాకర్, మాజీ మంత్రి ఏరాసు ఇలా అందరితోనూ గుంపుగా పనిచేయించి గెలవాలని టీడీపీ భావిస్తోంది. ఆర్థిక వనరుల విషయంలో ఎక్కడా వెనుకాడవద్దని టీడీపీ నేతలకు అధినాయకత్వం ఇప్పటికే ధైర్యం చెప్పిందంటున్నారు. అనుకూలమైన పోలీసు అధికారులను కూడా అక్కడ నియమించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

ఓటర్లలో ఉన్న సానుకూలత ఆధారంగా వైసీపీ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే మనిషి వైసీపీలో వున్నామనసు టీడీపీలో వుండే ఎంపీ బుట్టారేణుక ఈ ఎన్నికల్లో ఎలా కృషిచేస్తుందో తెలియదు. కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఆయన భార్య ఎమ్మెల్యే గౌరు చరిత, ఇతర నేతలు మాత్రం గెలుపు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మీదే ఆశలు పెట్టుకుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూసిన తర్వాత ఎన్నికలను తన భుజాల మీద వేసుకునేందుకు కోట్ల సుముఖంగా లేరని చెబుతున్నారు. పైగా ఆయన వైసీపీలో చేరుతారన్న అభిప్రాయం కూడా ఉంది. ఒకవేళ అదే జరిగితే కర్నూలులో వైసీపీకి తిరుగుండదని చెబుతున్నారు. అయితే అందుకు వైసీపీనుంచి కూడా రాయబారం నడవాల్సి ఉంటుందంటున్నారు. మొత్తం మీద గత రెండు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ ఈసారి అధికార బలాన్ని నమ్ముకుంది. మరి ప్రజాతీర్పు ఎలా ఉంటుందో?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News