పత్రీజీ బాటలో చాగంటి కోటేశ్వరరావు

చాగంటి కోటేశ్వరరావు గారు వాక్‌శుద్ధి వున్న పురాణ ప్రవచకులు. ఆయనకు లక్షలాదిమంది అభిమానులున్నారు. ఆయన కార్యక్రమాలు ప్రసారం చేయడానికి టీవి ఛానల్స్‌ ఎగబడతాయి. ఆయన ధార్మిక ఉపన్యాసాలు వినడానికి జనం ఎగబడతారు. వ్యక్తిగతంగా వివాదాస్పదుడు కాని ఆయనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులున్నారు. అయితే ఆయన వాల్మీకి రామాయణం, వ్యాస భారతాలకు సంబంధించి మూల గ్రంథాలలో లేని విషయాలను కొన్ని కల్పించి చెబుతుంటారు. కొన్ని వక్రీకరించి చెబుతుంటారు. మూల గ్రంథాలను చదివిన చాలా చాలా కొద్దిమందికి తప్ప […]

Advertisement
Update: 2016-06-28 00:37 GMT

చాగంటి కోటేశ్వరరావు గారు వాక్‌శుద్ధి వున్న పురాణ ప్రవచకులు. ఆయనకు లక్షలాదిమంది అభిమానులున్నారు. ఆయన కార్యక్రమాలు ప్రసారం చేయడానికి టీవి ఛానల్స్‌ ఎగబడతాయి. ఆయన ధార్మిక ఉపన్యాసాలు వినడానికి జనం ఎగబడతారు. వ్యక్తిగతంగా వివాదాస్పదుడు కాని ఆయనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులున్నారు.

అయితే ఆయన వాల్మీకి రామాయణం, వ్యాస భారతాలకు సంబంధించి మూల గ్రంథాలలో లేని విషయాలను కొన్ని కల్పించి చెబుతుంటారు. కొన్ని వక్రీకరించి చెబుతుంటారు. మూల గ్రంథాలను చదివిన చాలా చాలా కొద్దిమందికి తప్ప మిగిలినవారికి ఈ సంగతులు తెలియవు. అందరం రామాయణాన్ని నెత్తిన పెట్టుకుంటాం కానీ ఒరిజినల్‌ వాల్మీకి రామాయణాన్ని చదవం. లవకుశలాంటి సినిమాలు చూసి తెలుసుకున్నదే మన రామాయణ జ్ఞానం అంతా. వాల్మీకి రామాయణం మూల గ్రంథాన్ని లక్షకు ఒక్కరుకూడా చదివి వుండరు అంటే అతిశయోక్తి కాదు. అందువల్లే ఈ పురాణ ప్రవచనకారులు చెప్పిందే రామాయణం. కాబట్టి వాళ్లకు ఏమీ ఇబ్బంది లేకుండా జరిగిపోతూవుంది.

అయితే అప్పుడప్పుడు వీళ్లు శృతిమించి రాగానపడ్డట్టుగా అనవసరపు విషయాలను ప్రవచిస్తుంటారు. చాగంటివారు కొద్దిరోజుల క్రితం ఒకచోట మాట్లాడుతూ భర్త బట్టలు ఉతికి ఆ నీళ్లను తలమీద చల్లుకోవాలని సూచించారు. అది చూసి అనేకమంది స్తీలు చాగంటిని సోషల్‌మీడియాలో ఉతికి ఆరేశారు.

మళ్లీ ఇటీవల ఆయన కృష్ణుడిమీద వ్యాఖ్యానిస్తూ నెమళ్ల ప్రత్యుత్పత్తి గురించి తనదైన శైలిలో సైన్స్‌కు విరుద్ధంగా, సృష్టిరహస్యాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారట. దాంతో హేతువాదులు, సైన్స్‌ తెలిసినవాళ్లు సోషల్‌మీడియాలో చాగంటిమీద విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా నెమళ్ల కలయికను వీడియోలతోసహా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

గతంలో పత్రీజీ ఇలాగే అతికి పోయి డాక్టర్‌లకు ఏమీ తెలియదంటూ సైన్స్‌ గురించి, వైద్యం గురించి నానా చెత్త మాట్లాడారు, రాశారు. ఇప్పుడు చాగంటివారు కూడా ఆయన బాటలో పయనించకుండా గౌరవంగా ప్రవచనాలకు పరిమితమైతే మంచిదని, వాల్మీకి అవతారమెత్తి రామాయణంలో మార్పులు, చేర్పులు చేసి ఉపన్యాసాలిచ్చినట్టే డార్విన్‌ తదితర సైంటిస్ట్‌ల అవతారమెత్తి సైన్స్‌ను, వైద్యాన్నిమార్పులు, చేర్పులు చేయడానికి సాహసించవద్దని నెటిజన్‌లు కోరుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News